Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ కు 1918ని గుర్తు చేస్తున్న మ‌హ‌మ్మారి వైర‌స్‌!!

By:  Tupaki Desk   |   10 July 2020 5:30 AM GMT
హైద‌రాబాద్‌ కు 1918ని గుర్తు చేస్తున్న మ‌హ‌మ్మారి వైర‌స్‌!!
X
ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్ తెలంగాణలో ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో తీవ్రంగా విస్త‌రిస్తోంది. రోజుకు వేల సంఖ్య‌లో ఈ న‌గ‌రం నుంచే కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 30 వేల కేసులు దాట‌గా వాటి లో దాదాపు 25,000 కేసులు ఒక్క భాగ్య‌న‌గ‌రంలోనే ఉన్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ విధంగా మ‌హ‌మ్మారి హైద‌రాబాద్‌ లో విజృంభిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో హైద‌రాబాద్‌ వాసుల‌ను 1918 సంవ‌త్స‌రాన్ని గుర్తుచేస్తోంది. 1918లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ తీరును ప్ర‌స్తుత వైర‌స్ జ్ఞాప‌కం వ‌స్తోంది.

హైద‌రాబాద్ న‌గ‌రం జ‌న్మించేందే ఒక వ్యాధిని త‌ట్టుకుని. హైద‌రాబాద్ తొలినాళ్ల‌లో చాలా వ్యాధులు ప్ర‌బ‌లాయి. అలాంటి స‌మ‌యంలోనే 1918 సంవ‌త్స‌రంలో స్పానిష్ ఫ్లూ వ్యాపించింది. స్పానిష్ ఫ్లూ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించి క్ర‌మంగా విస్త‌రిస్తూ సెప్టెంబర్ వ‌ర‌కు తీవ్ర రూపం దాల్చింది. ఇక ఆ సంవ‌త్స‌రం అక్టోబర్ వ‌ర‌కు ఫ్లూ బారిన హైద‌రాబాద్ న‌గ‌రం గ‌జ‌గ‌జ వ‌ణికింది. స్పానిష్ ఫ్లూ బారిన ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప‌డ‌గా వేల సంఖ్య‌లో మృత్యులు జ‌రిగాయి.

1921 జనాభా లెక్కల ప్రకారం ఇన్‌ఫ్లుయెంజా వ్యాధితో హైదరాబాద్ నగరంలో 1918 సెప్టెంబర్ నాటికి ప్రతి వెయ్యి మందిలో 46.5 శాతం మంది చనిపోయారు. 1911-1921 దశాబ్దంలో వచ్చిన ప్లేగు, కలరా వల్ల వరుసగా 1,94,325 మంది, 42,246 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అప్ప‌టి మాదిరి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో మ‌హ‌మ్మారి వైర‌స్ ప‌రిణామం ఉంది. అప్ప‌టి మాదిరి ప్ర‌స్తుత వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది.

ఈ వైర‌స్ రాష్ట్రంలో తొలిసారిగా నెమ్మ‌దిగా ప్రవేశించింది. తొలి కేసు హైద‌రాబాద్‌ లోనే వెలుగు లోకి వ‌చ్చింది. ప్రారంభ స‌మ‌యం లో వైర‌స్ సాధార‌ణ స్థితిలో విస్త‌రించింది. కొద్దిసంఖ్య‌లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వైర‌స్ తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కేసులు హైద‌రాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్నాయి. రెండు వారాలుగా కేసులు వెయ్యికి పైగా న‌మోద‌వుతున్నాయి. దీంతో హైద‌రాబాద్‌ లో ప్రమాదకర స్థితి చేరుకుంది. దీంతో హైద‌రాబాద్‌వాసులు భ‌యాందోళనలో ఉన్నారు.

స్పానిష్ ఫ్లూ - ప్ర‌స్తుత వైర‌స్ రెండు మహమ్మారులు నగరంలో ఒకే విధంగా విస్తరిస్తున్నాయ‌ని చ‌రిత్ర‌కారులు, విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఈ వైర‌స్‌తో పోల్చి చూస్తే అప్పుడు ప్ర‌బ‌లిని ఫ్లూ వల్ల అధిక మ‌రణాలు సంభవించాయ‌ని గుర్తుచేస్తున్నారు. అప్ప‌ట్లో నగరంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు ఆ ఫ్లూ బారిన ప‌డ్డార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఆ విధంగా అప్ప‌టి ఫ్లూ.. ఇప్ప‌టి వైర‌స్ ఒకే తీరున విస్త‌రిస్తున్నాయి. హైద‌రాబాద్ వ్యాధుల‌తో తీవ్రంగా పోరాడి చివ‌ర‌కు గెలిచి నిల‌బ‌డుతుంద‌ని చెబుతున్నారు.