Begin typing your search above and press return to search.

ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ ..బిల్లు చూసి డాక్టర్ కంటతడి !

By:  Tupaki Desk   |   8 July 2020 12:00 PM GMT
ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ ..బిల్లు చూసి డాక్టర్ కంటతడి !
X
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది. పాజిటివ్ కేసులు ప్రతి రోజు భారీగా నమోదౌతున్నాయి. ఇకపోతే కరోనా వైరస్ సోకితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ప్రభుత్వ హాస్పిటల్ పై నమ్మకంలేని చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే , ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా చికిత్సకు అవుతున్న బిల్లులతో సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌ ను తలుచుకుంటేనే వణికిపోతున్నారు. ఈ కష్టాలు డాక్టర్లకు సైతం తప్పడం లేదు.

తాజాగా కరోనా వైరస్ భారిన పడిన ఓ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరగా ..ఆమెకి వేసిన బిల్లుని చూసి ఆ డాక్టర్ కంటతడి పెట్టుకుంది. తనకి , తన తండ్రికి అందించిన వైద్యం , మందుల పేరుతొ భారీగా ఛార్జ్ చేసారని ..ఏంటిది అని ప్రశ్నిస్తే ఏదేదో సమాధానం చెప్తున్నారని తెలిపింది. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ కరోనా వైరస్ భారిన పడి ట్రీట్మెంట్ కోసం చేరితే తనకి భారీగా బిల్లు వేశారని మీరే కాపాడాలని ఆ డాక్టర్ మంత్రి ఈటెల ను కోరింది.

ఇలాంటి ఘటనే కొన్ని రోజుల క్రితం ఛాదర్‌ ఘాట్ ‌లోని తుంబే ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఫీవర్ ఆస్పత్రిలో డీఎంవో అయిన డాక్టర్ సుల్తానా కు ఈ నెల ఒకటో తేదీన కరోనా పాజిటివ్ ‌గా తేలింది. దీంతో చికిత్స కోసం ఛాదర్‌ఘాట్‌లోని తుంబే ప్రైవేట్ ఆసుపత్రిలో సుల్తానా చేరారు. ఆమెతో పాటు సోదరి కూడా ఉన్నారు. అయితే ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు వేశారు. తాను డాక్టర్‌ నని అయినా 24 గంటల చికిత్సకు లక్షల్లో బిల్లు వేయడం ఏంటని తుంబే హాస్పిటల్ యాజమాన్యాన్ని డాక్టర్ సుల్తానా ప్రశ్నించారు. మొత్తంగా కరోనా పేరుతొ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలని దోచేయకుండా ప్రభుత్వమే దీనిపై తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజానీకం కోరుతున్నారు.