తెలంగాణలో తీవ్రస్థాయిలో వైరస్ విజృంభణ: కొత్తగా 1879 కేసులు

Wed Jul 08 2020 10:30:47 GMT+0530 (IST)

Dangerous Disease In Telangana

మహమ్మారి వైరస్ తెలంగాణలో తీవ్ర స్థాయిలోనే విజృంభిస్తోంది. రోజు 1500కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం 1879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది వైరస్ తో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 27612కి చేరగా.. మొత్తం మృతులు 313 మంది ఉన్నారు.వైరస్ నుంచి కోలుకుని 1506 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 11012 అత్యధికంగా కొత్తగా కేసులు యథావిధిగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి.. మేడ్చల్.. సంగారెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే వైరస్ కట్టడి చర్యలపై మాత్రం ఉన్నత స్థాయి సమీక్ష ధారం రోజులుగా లేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్ని రోజులుగా ప్రగతిభవన్ లో ఉండడం లేదని సమాచారం. ఆయన కుమారుడు కేటీఆర్ కూడా కనిపించడం లేదు.