Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఫ్రీ టెస్టు చేయించుకోవాలంటే ఎక్కడ?

By:  Tupaki Desk   |   2 July 2020 6:45 AM GMT
హైదరాబాద్ లో ఫ్రీ టెస్టు చేయించుకోవాలంటే ఎక్కడ?
X
అసలే మహమ్మారి కాలం. అన్ని అనుమానాలే. ఎప్పుడు ఎక్కడ తగులుకుంటుందో తెలీని పరిస్థితి. ఈ దరిద్రాలు సరిపోవన్నట్లు.. వర్షాకాలం వచ్చి పడటం.. వాతావరణ మార్పులతో పలువురు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒళ్లు కాస్త వేడెక్కినా.. గొంతులో నొప్పి మొదలైనా వణికిపోతున్నారు. తమకు మహమ్మారి సోకిందన్న భయాందోళనలకు గురవుతున్నారు. మనసులో ఉండే నమ్మకాన్నిపక్కన పెట్టి.. ఇలాంటి సందర్భాల్లో టెస్టులు చేయించుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉండే వారు చాలామందే ఉంటారు.

కాకుంటే.. ఇలంటివారిలోకొందరు మాత్రమే ప్రైవేటు ల్యాబ్ లకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. అత్యధికులు మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ కేంద్రాలకు వెళ్లి శాంపిల్స్ ఇచ్చి రావటం కనిపిస్తుంటుంది. ఇంతకీ.. ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో మహమ్మారికి సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించేది ఎక్కడన్న ప్రశ్న చాలామందిలో కలుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో ఎనభై శాతానికి మించిన పాజిటివ్ కేసులు హైదరాబాద్ మహానగరంలోనే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్న ఈ పరిస్థితుల్లో ఉచిత పరీక్షలు హైదరాబాద్ లో ఎక్కడక్కడ నిర్వహిస్తున్నారన్న దానిపై తాజాగా రాష్ట్ర సర్కారు క్లారిటీ ఇచ్చింది.

హైదరాబాద్ మహానగరంలో ఉచిత పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడంటే..

1. కింగ్ కోఠి హాస్పిటల్, కోఠి.
2. ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట
3. నేచర్ క్యూర్ హాస్పిటల్, అమీర్ పేట్
4. చెస్ట్ హాస్పిటల్, ఎర్రగడ్డ
5. ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఎర్రగడ్డ
6. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహిదీపట్నం
7. నిజామియా టిబీ హాస్పిటల్, చార్మినార్
8. హోమియోపతి హాస్పిటల్, రామంతాపూర్
9. ఈఎస్ఐ హాస్పిటల్, నాచారం
10. ఏరియా హాస్పిటల్, కొండాపూర్
11. ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం