కర్నాటకలో 24 వేల మంది తప్పుడు వివరాలు.. వెతికే పనిలో యంత్రాంగం!!

Thu Jul 16 2020 22:00:01 GMT+0530 (IST)

Dangerous Disease In Karnataka

కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడంతో మహమ్మారి వైరస్ వ్యాప్తి తీవ్రంగా వ్యాపిస్తోంది. కొందరు వైరస్ వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. అలాంటి నిర్లక్ష్యంతోనే బెంగళూరులో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేసి తప్పుడు అడ్రస్‌లు ఇచ్చి... అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికార యంత్రాంగానికి బురిడీ కొట్టించి వైరస్ ప్రబలడానికి కారణమయ్యారు. దీంతో కర్నాటకలో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీని ప్రభావమే ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు.రాష్ట్రానికి వచ్చే ఇతర ప్రాంతాల వారు 14 రోజులు హోం క్వారంటైన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు నిర్లక్ష్యంతో క్వారంటైన్ ఉండకుండా తప్పుడు వివరాలు ఇచ్చారు. ఆ విధంగా ఏకంగా 23 వేల మంది తప్పుడు వివరాలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ స్క్వాడ్‌లో తప్పుడు వివరాలతో నమోదు చేసుకున్నారు. ఆ చిరునామాలకు వెళ్లగా అక్కడ ఆయా పేర్లతో ఎవరూ లేరని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. వారి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరు అర్బన్ జిల్లాలో ఆదివారం వరకు 69 297 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వారిలో కేవలం 46113 మంది మాత్రమే సరైన చిరునామా వివరాలు ఇచ.చారు. మిగతా 23 184 మంది తప్పుడు వివరాలు ఇచ్చారు. దీంతో వారిని ట్రాక్ చేయడం ఇబ్బందిగా మారింది. వాలంటీర్ల సాయంతో వారిని వెతికే ప్రయత్నం చేసినా ఫలితం ఉండడం లేదు. ప్రస్తుతం వారికోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఆరా తీస్తున్నారు.  బెంగళూర్ లాక్ డౌన్ కు కారణం ఇదేనని అధికారులు భావిస్తున్నారు.