మరోసారి 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు ... ఎన్ని మరణాలంటే ?

Fri May 07 2021 13:00:01 GMT+0530 (IST)

Dangerous Disease In India

దేశంలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం రోజురోజుకి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటుంది. దీనితో రోజువారీ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. కరోనా వైరస్ విజృంభణతో నిన్న 4 లక్షల 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా నాలుగు వేలకు చేరువలో మరణాలు రికార్డయ్యాయి. దేశంలో మూడు లక్షలకుపైగా కేసులు నమోదవడం వరుసగా ఇది 15వ రోజు. నిన్న కొత్తగా 414188 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 331507  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21491598కు చేరింది.గడచిన 24 గంటల సమయంలో 3915 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  234083కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 17612351 మంది కోలుకున్నారు. ఇండియాలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో నమోదవడం ఇదే మొదటిసారి. మే 1న మొదటిసారిగా 4 లక్షలకుపైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా దానికంటే మరో 10 వేలు కేసులు అధికంగా నమోదయ్యాయి. కాగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 51880 కేసులు ఉండగా కర్ణాటకలో 50112 ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర తర్వాత దేశంలో 50 వేలకుపైగా కేసులు నమోదైన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. అయితే మరఠ్వాడాలో కరోనా కేసులు కొద్దిగా తగ్గడం విశేషం. అక్కడ మంగళవారం 57640 నమోదవగా నిన్న 51880కి తగ్గాయి. ఇక కేరళలో 41953 తమిళనాడులో 23310 పశ్చిమబెంగాల్‌లో 18102 పంజాబ్‌లో 8105 నమోదయ్యాయి. మరణాల విషయానికి వస్తే.. కొత్తగా నమోదైన 3980 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 920 ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 357 కర్ణాటకలో 346 పంజాబ్‌లో 182 హర్యానాలో 181 తమిళనాడులో 167 చొప్పున ఉన్నాయి.