దేశంలో 2 కోట్ల కరోనా కేసులు ... తగ్గుముఖం పట్టిన కరోనా !

Tue May 04 2021 15:00:01 GMT+0530 (IST)

Dangerous Disease In India

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. దేశంలో రోజూ నాలుగు లక్షల కరోనా కేసులు వచ్చేవి. మూడు రోజులుగా అవి తగ్గుతూ ఉన్నాయి. కొత్తగా 357229 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20282833కి చేరింది. కొత్తగా 3449 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 222408కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది.తాజాగా 320289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 16613292కి చేరింది. రికవరీ రేటు 81.9 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో 3447133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1663742 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్ లో ఇప్పటివరకు 29 కోట్ల 33లక్షల 10వేల 779 టెస్ట్ లు చేశారు. కొత్తగా 1708390 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 15కోట్ల 89లక్షల 32వేల 921 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.   ప్రపంచదేశాల్లో కొత్తగా 660578 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 15.41 కోట్లు దాటింది. కొత్తగా 10298 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 32.26 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.86 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 38514 కేసులు 443 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 36524 కొత్త కేసులు... 1054 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ అత్యధిక కేసులు ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత అమెరికా బ్రెజిల్ టర్కీ ఇరాన్ ఉన్నాయి.