Begin typing your search above and press return to search.

పాలకుల అలక్ష్యం ప్రజల్నే కానీ.. నేతల ఫ్యామిలీలను చంపేస్తోంది

By:  Tupaki Desk   |   4 May 2021 5:30 AM GMT
పాలకుల అలక్ష్యం ప్రజల్నే కానీ.. నేతల ఫ్యామిలీలను చంపేస్తోంది
X
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా కరోనా కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటమే కాదు.. ప్రముఖుల కుటుంబాల్ని కబళించివేస్తోంది. కేంద్రం కావొచ్చు.. రాష్ట్రాలు కావొచ్చు.. కరోనా విషయంలో వారు అనుసరించిన విధానాలే వారి కుటుంబాలకు.. వారి సన్నిహితుల ఉసురు తీయటం కనిపిస్తోంది. తాజాగా ఆ జాబితాలో కేంద్రమంత్రి కుమార్తె చేరారు.

కేంద్రమంత్రి తావర్ చంద్ గహ్లోత్ కుమార్తె 42 ఏళ్ల గోయిత సోలంకి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన తర్వాత ఆమెను తొలుత ఉజ్జయనిలోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయినా.. ఫలితం లేకపోవటంతో వారం క్రితం ఇండోర్ లోని వేదాంత ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటికే ఆమె ఊపిరితిత్తులు 80 శాతం వైరస్ బారిన పడటంతో సేవ్ చేయలేకపోయినట్లు పేర్కొన్నారు.

కలియుగ వైకుంఠంగా చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్న నారాయణ దీక్షితులు కరోనా కాటుకు బలయ్యారు. నెల క్రితమే ఆయన్ను ఆలయ ప్రధాన ఆర్చకులుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. గతంలో పోయిన పదవి మళ్లీ వచ్చిందన్న సంతోషం లేకుండా ఆయనకు కరోనా సోకటం.. ఆరోగ్యం విషమించటంతో ఆయన కన్నుమూశారు. కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. దీంతో.. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది.

ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించి.. కరోనా బారిన పడిన మాజీ ఎంపీ సబ్బం హరి సోమవారం కన్నుమూయటం తెలిసిందే. కరోనా సోకిన అనంతరం ఆయన్ను ఆసుపత్రిలో చేర్చించి వైద్యం చేయిస్తున్నారు. ఒక దశలో హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్సు ఏర్పాటు చేసి.. ఆయన్ను తరలించాలని చంద్రబాబు భావించారు. ఇందుకు ప్రయత్నాలు చేసినా.. ఎందుకో ఆగిపోయారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతలకు షాకింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు కరోనా సోకింది. వారం క్రితం తమ్మినేని సతీమణి.. నాలుగు రోజుల క్రితం తమ్మినేని శ్రీకాకుళం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.