Begin typing your search above and press return to search.

ఇండియా : 24 గంటల్లో లక్షా 26వేల కేసులు .. ఇదే అల్ టైం రికార్డ్ !

By:  Tupaki Desk   |   8 April 2021 5:39 AM GMT
ఇండియా : 24 గంటల్లో లక్షా 26వేల కేసులు .. ఇదే అల్ టైం రికార్డ్ !
X
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం దేశంలో క‌రోనా విజృంభ‌ణ తీవ్ర స్థాయిలో ఉంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. మూడు రోజుల తేడాలో మరోసారి రికార్డు స్థాయిలో లక్షకి పైగా కేసులు నమోదై రికార్డుల్ని తిరగరాశాయి. దేశంలో గ‌త 24 గంటల్లో 1,26,789 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి‌ 59,258 మంది కోలుకున్నారు. అలాగే తాజాగా నమోదు అయిన కరోనా కేసులతో కలిపి మొత్తం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది.

అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 685 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,66,862 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,18,51,393 మంది కోలుకున్నారు. 9,10,319 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 9,01,98,673 మందికి వ్యాక్సిన్లు వేశారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ 59,907 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఛత్తీస్‌గఢ్‌లో 10,310, కర్నాటకలో 6,976, కేరళలో 3502, తమిళనాడులో 3,986, పంజాబ్‌లో 2963, మధ్యప్రదేశ్‌ లో 4043, గుజరాత్‌ లో 3575 మందికి కొత్తగా కరోనా సోకింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,26,77,379 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 12,37,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీరు పని చేసే ప్రాంతానికే వైద్య అధికారులు వచ్చి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏప్రిల్‌ 11 నుంచి టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ బుధవారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏదైనా కార్యాల యంలో 45 ఏళ్ల వయసు పైబడిన వారు 100 మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సుము ఖంగా ఉంటే అక్కడే వారికి టీకా ఇవ్వడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆ లేఖ లో స్పష్టం చేశారు.