Begin typing your search above and press return to search.

భారత్‌ లో 80 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు .. ఒక్కరోజే ఎన్నంటే

By:  Tupaki Desk   |   28 Oct 2020 9:10 AM GMT
భారత్‌ లో 80 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు .. ఒక్కరోజే ఎన్నంటే
X
కరోనా వైరస్ ..కరోనా వైరస్ .. ఈ మహమ్మారి పేరు విని విని అందరికి అలవాటైపోయింది కానీ , ఈ మహమ్మరి పీడ ఎప్పుడు పోతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా రోజు రోజుకి మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనితో ఈ మహమ్మారిని అంతం చేయగలిగే సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ మహమ్మారి జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటూ పలువురు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నరు. ఇక అమెరికా లో కూడా మళ్లీ కరోనా కేసుల సంఖ్య భారీ గా పెరిగి పోతుంది.

గత 24 గంటల్లో అమెరికాలో మరో 75 వేల 72 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల తో కలిపి దేశంలో మొత్తం నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షల 38 వేల 30గా ఉన్నాయి. అయితే రికవరీ రేటు కూడా బాగానే ఉంది. 58 లక్షల 77 వేల 964 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో అమెరికాలో 1039 మంది చనిపోయారు. ఇక ఇండియా లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

ఇక ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 43,893 కరోనా కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. నిన్న కరోనాతో 508 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,20,010కి చేరింది. అలాగే గత 24 గంటల్లో దేశంలో 58,439 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,59,509గా ఉంది. దేశంలో రికవరీ రేటు 90.9 శాతంగా ఉంది. ఇదో మంచి పరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,803 ఉన్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 10,66,786 టెస్టులు జరిగాయి. మొన్నటి కంటే ఇవి 108670 ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 10,54,87,680 టెస్టులు జరిగాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌ లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఇండియా రెండో స్థానం లో ఉంది. బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, బ్రెజిల్, బ్రిటన్ టాప్ 5లో ఉన్నాయి.