Begin typing your search above and press return to search.

దేశంలో 24 గంటల్లో 46,790 పాజిటివ్ కేసులు !

By:  Tupaki Desk   |   20 Oct 2020 8:15 AM GMT
దేశంలో 24 గంటల్లో  46,790 పాజిటివ్ కేసులు !
X
కరోనా వైరస్ ... కరోనా వైరస్ ... ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా ప్రభావం మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపోతే ఇండియా లో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. దేశంలో గత 24 గంటల్లో ఇండియాలో నమోదైన కరోనా కేసులు 46,790 మాత్రమే. ఇది వరకు రోజుకు లక్షకు పైగా కేసులొచ్చే స్థాయి నుంచి, ఇప్పుడు 50వేల కంటే దిగువకు తగ్గించడం విజయమే. కొత్త కేసులతో కలిపి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 75,97,063కి చేరింది. ఇక నిన్న 587 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,15,197కి చేరింది. మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.7 శాతంగా ఉంది.

ఇండియాలో నిన్న కరోనా నుంచి 69,720 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 67,33,328కి చేరింది. రికవరీ రేటు మరింత పెరిగి 88.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 7,48,538 ఉన్నాయి. ఇండియాలో నిన్న 10,32,795 టెస్టులు చేశారు. మొన్నటి కంటే ఇవి 173,009 ఎక్కువ. మొత్తం టెస్టుల సంఖ్య 9 కోట్ల 61 లక్షల 16 వేల 771కి చేరింది. జులై 29 తర్వాత... కొత్త కేసులు... 46.8వేలు మాత్రమే రావడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో కొత్తగా 5.98 కేసులొచ్చాయి. జులై 8 తర్వాత ఇంత తక్కువ కేసులు రావడం ఇదే తొలిసారి.

ఇండియాలో మొన్నటి కంటే నిన్న 23.5 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసులు 7.5లక్షల కంటే తక్కువకు చేరాయి. మిగతా... 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇది మంచి పరిణామం. ఇండియాలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 90 శాతానికి పైగా రికవరీ రేటు ఉంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. భారత్, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానానికి రాగా, ఆ తర్వాత ఇండియా, బ్రిటన్, రష్యా, బ్రెజిల్, ఫ్రాన్స్ ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్, ఇటలీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.