Begin typing your search above and press return to search.

కొనసాగుతున్న కరోనా థర్డ్‌ వేవ్ ... మరోసారి ముప్పు తప్పదా !

By:  Tupaki Desk   |   20 Oct 2020 7:30 AM GMT
కొనసాగుతున్న  కరోనా థర్డ్‌ వేవ్ ... మరోసారి ముప్పు తప్పదా !
X
కరోనా మహమ్మారి ... చైనాలో మొదలైన ఈ మహమ్మారి ఆ తర్వాత ఒక్కొక్క దేశానికి విస్తరిస్తూ , ప్రపంచం మొత్తం వ్యాపించింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తగ్గిపోయిందనుకున్న చోట కూడా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. చాలా ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ తో కొత్త కేసులు విరుచుకుపడుతున్నారు. అమెరికాలో సెకండ్ వేవ్ ఉండగానే థర్డ్ ‌వేవ్ కూడా ప్రారంభం అయింది. ఇక ఇండియా సంగతి కరోనా తొలి కెరటం పూర్తికాకముందే సెకండ్ వేవ్ మొదలైంది.

చైనాలో ఫస్ట్ ‌వేవ్ కేసులు చైనాలో మొదలైయ్యాయి. 2019 డిసెంబర్‌ లో తొలిసారి తాము కరోనా వైరస్ బారిన పడ్డామని చైనా బయట పెట్టినప్పటి నుండి తొలి దశ మొదలైనట్లు. ఆనాడు విరుచుకుపడిన కరోనా కేసులను కట్టడిచేసి,చైనా కంట్రోల్ చేసింది. అంటే, ఫిబ్రవరి చివరికి ఫస్ట్ వేవ్ ముగిసింది. ఆ తర్వాత మార్చిలో యూరోప్ దేశాల్లో సెకండ్‌ వేవ్. అంటే చైనా నుంచి వెళ్లిన రోగుల నుంచి స్థానికంగా కరోనా విజృంభించడం మొదలుపెట్టింది. సెకండ్‌ వేవ్‌ కి ఇటలీ మొదటి హాట్‌ స్పాట్. ఆ తర్వాత స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ ‌లు ప్రపంచ కరోనాకు కేంద్రంగా మారాయి. మే లో అమెరికాలో కరోనా విజృంభణ పీక్ కి చేరింది. అక్కడ నుంచి ధర్డ్‌వేవ్ మొదలైనట్లు లెక్కవేస్తున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్యలో అమెరికాతో పోటీపడింది బ్రెజిల్. ఆగస్ట్ నాటికి ఇండియా పోటీకొచ్చింది. కరోనా హాట్‌ స్పాట్‌ గా మారింది.

థర్డ్ వేవ్ అమెరికాలో అల్లకల్లోలం సృష్టించింది. 50వేలకు తగ్గకుండా గతవారం వరకు అమెరికాలో కేసులు వస్తూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ కేసులు తగ్గిన తర్వాత, కరోనా అదుపులోకి వచ్చిందనుకున్న తర్వాత, ఒక్కసారి మళ్లీ కొత్తగా కేసులు. కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఆగస్ట్ ‌తో పోలిస్తే మళ్లీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. సెకండ్‌ వేవ్ తగ్గిత తర్వాత ఫ్లోరిడా, టెక్సాస్ , కాలిఫోర్నియా రాష్ట్రాల్లో మళ్లీ థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చింది.ఈ థర్డ్ వేవ్ ఎంత ప్రమాదకరమంటే… కేసుల సంఖ్యలో సెకండ్ ‌వేవ్‌ నే మించిపోవచ్చు. శుక్రవారం తొలిసారి యూరోప్ ‌లో 1,50,000 కేసులు నమోదవడమంటే ఆల్‌ టైమ్ హై. ముందువారమే రోజువారి కేసులు లక్ష దాటగానే, ప్రపంచం అదిరపడింది. రష్యా , ఫ్రాన్స్, యూకే ల్లో సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదువుతున్నాయి. అందుకే చాలా యూరోప్ దేశాలు లాక్‌ డౌన్‌ ను పాటిస్తున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా ఇండియాలో కొత్త కేసులు తగ్గుతున్నాయి. మార్చిలో కేసులు నమోదైననాటి నుంచి కేసులు తగ్గడం ఇదే మొదలు. ఇప్పుడు కేసుల సంఖ్య 60 వేలు. సెప్టెంబర్ మధ్యతో పోలిస్తే 33శాతం తగ్గుదల. జూన్‌ రెండోవారంతో పోలిస్తే కొత్త కేసులు తక్కువే. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్, ఇటలీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.