Begin typing your search above and press return to search.

అగ్రస్థానంలో భారత్ ..ఎందులో అంటే !

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:30 AM GMT
అగ్రస్థానంలో భారత్ ..ఎందులో అంటే !
X
కరోనా వైరస్ .. ఈ వైరస్ ఏ ముహూర్తాన చైనాలో వెలుగులోకి వచ్చిందో కానీ , అప్పటి నుండి నేటి వరకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఏదైనా అత్యవసరం అయితే తప్ప , ఎవరూ బయటకిరావడం లేదు. ఇది చైనాలో వెలుగులోకి వచ్చినా కూడా , దాని భారి నుండి చైనా త్వరగానే కోలుకుంది. కానీ , ఇప్పటివరకు కరోనా కారణంగా బాగా ఎఫెక్ట్ అయిన దేశం అంటే అమెరికానే .. అమెరికా లో కరోనా విలయతాండవం చేస్తుంది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 47 లక్షలు దాటింది , అలాగే మొత్తం మరణాలు 157855కి చేరాయి. ఆ తరువాత కరోనా తో ఎఫెక్ట్ అయ్యే దేశం మన ఇండియానే. మొదట్లో ఇండియా లో కరోనా కంట్రోల్ లో ఉన్నప్పటికీ .. లాక్ డౌన్ నుండి ఎప్పుడైతే సడలింపులు ఇవ్వడం ప్రారంభించారో అప్పటి నుండి ఇండియా లో కరోనా జోరు మొదలైంది.

ఆలా ఇండియాలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,03,695కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,135కి పెరిగింది. 5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 11,86,203 మంది కోలుకున్నారు.గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 771 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఒక్కరోజులో భారత్ లో 52,972 కేసులు రాగ ..అమెరికా లో 49038 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 64.53 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 2.15 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే రికవరీ, మరణాల రేటులో భారత్ చాలా మెరుగ్గా ఉంది. చైనా, అమెరికా, రష్యా తర్వాత అత్యధిక కరోనా పరీక్షలు చేసిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తోంది.