Begin typing your search above and press return to search.

అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం..నిముషానికి ఎంతమంది మరణిస్తున్నారంటే!

By:  Tupaki Desk   |   21 Nov 2020 7:30 AM GMT
అమెరికాలో మళ్లీ కరోనా కల్లోలం..నిముషానికి ఎంతమంది మరణిస్తున్నారంటే!
X
కరోనా వైరస్ ... కరోనా వైరస్ ... ప్రపంచంలో దేశం ఏదైనా కూడా ఈ పేరు చెప్పగానే వెన్నులో వణుకు మొదలు అవుతుంది. దానికి కారణం , ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి సరైన వ్యాక్సిన్ ను కనిపెట్టలేకపోవడమే. వ్యాక్సిన్ లేకపోవడం తో ఈ మహమ్మారి అడ్డుఅదుపు లేకూండా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతోంది. చైనా లో మొదలైన ఈ వ్యాధి అక్కడ ఏ మేర ప్రభావం చూపిందో ఖచ్చితంగా తెలియదు కానీ, అమెరికాను మాత్రం అతలాకుతలం చేసింది. అయితే , ఆ మధ్య అమెరికాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది అని చెప్పినప్పటికీ , మళ్లీ ఆ విజృంభణ కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం అమెరికాలో ప్రతి నిమిషానికి ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా అమెరికన్లను మహమ్మారి బలి తీసుకుంది. ప్రస్తుతం అక్కడ 45.71 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయి.ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా బాధితులు వస్తుండటంతో ఆక్కడి ఆసుపత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. సరిపడినంత స్థాయిలో పడకలు లేక, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, విశ్రాంతి సముదాయాలు సహా వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ పడకలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు, మూడు వారాల క్రితం.. రోజుకు 70-80 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ, ఒక్కరోజే లక్షా 55వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా, 24 గంటల్లో 1700 మరణాలు సంభవిస్తే.. రెండు నుంచి మూడు వారాలు గడిచేటప్పటికి రోజుకు సుమారు 3 వేల మంది మృతిచెందవచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే , ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 13 లక్షల మందికి పైగా మృతి చెందారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 1, 22, 68, 678 కరోనా కేసులు నమోదవగా.. 2,60, 235 మంది మృతి చెందారు.