Begin typing your search above and press return to search.

అమెరికాలో మ‌ళ్లీ జూలు విదిలిస్తున్న కరోనా ..ఒక్కరోజే 68,000 మందికి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   11 July 2020 7:50 AM GMT
అమెరికాలో మ‌ళ్లీ జూలు విదిలిస్తున్న కరోనా ..ఒక్కరోజే  68,000 మందికి పాజిటివ్ !
X
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో కంటే అగ్రరాజ్యం అమెరికాలోనే ఎక్కవ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు అయిన అమెరికాలో .. మళ్లీ గత మూడు రోజులుగా వైరస్ జూలు విదిలిస్తుంది. వరుసగా మూడు రోజుల నుంచి 60,000 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అమెరికా వాసులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా శుక్రవారం 68,000 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఆ దేశంలో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

అమెరికాలోని అలస్కా, జార్జియా, ఇదాహో, లూసియానా, మోంటానా, ఒహియో, ఉతా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 68,000 మందికి వైరస్‌ సోకగా దేశంలో కేసుల సంఖ్య 32 లక్షల మార్కును దాటేసింది. అలాగే మృతుల సంఖ్య 136,671కి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 12,631,067కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రెజిల్‌ లోనూ తీవ్రంగానే ఉంది. ఇక 1,460,495 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 4 కోట్లకు పైగా కరోనా టెస్టులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా ఈ కరోనా వైరస్ దెబ్బకి వణికిపోతోంది.