Begin typing your search above and press return to search.

ఊరు ఊరంతా వైర‌సే.. ఆ ఒక్క గ్రామంలోనే 54 కేసులు

By:  Tupaki Desk   |   29 May 2020 11:30 AM GMT
ఊరు ఊరంతా వైర‌సే.. ఆ ఒక్క గ్రామంలోనే 54 కేసులు
X
మ‌హ‌మ్మారి వైర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజృంభిస్తూ క‌ల్లోలం సృష్టిస్తోంది. మూడు వేల‌కు పైగా కేసులు చేరుకున్నాయి. రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ ఊరు ఊరంతా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లింది. ఆ ఒక్క‌ గ్రామంలోనే 54 కేసులు న‌మోద‌వ‌డంతో గ్రామ‌మంతా కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. ఆ గ్రామ‌మే ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలోని జీ మామిడాడ‌. తూర్పు గోదావరి జిల్లాలో కేసులు భారీగానే ఉన్నాయి. ఈ జిల్లాలోని మామిడాడ గ్రామంలో మే 21వ తేదీన తొలి పాజిటివ్ కేసు వెలుగులోకి వ‌చ్చింది. అదేరోజు బాధితుడు కాకినాడలోని జీజీహెచ్‌ లో చికిత్స పొందుతూ మరణించారు. దీనికి అనుస‌రించి కేసులు ఒక్క‌సారిగా జీ మామిడాడలో పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ గ్రామంలో ఏకంగా 54 కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

తొలి పాజిటివ్ కేసు కాంటాక్ట్ నుంచి కేసులు పెరిగిపోవ‌డం మొదలయ్యాయి. ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల ఐదు మండలాలకు కూడా వ్యాపించింది. దీంతో ఈ గ్రామం చుట్టుప‌క్క‌లా మొత్తం 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కాంటాక్ట్ నుంచి ఇన్ని కేసులు నమోదు కావడం తూర్పు గోదావ‌రి జిల్లాలో ఆందోళన రేకెత్తుతోంది. ఈ విధంగా జీమామిడాలలోనే 54 కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం ప‌లు మండ‌లాల‌కు కూడా ఆ వైర‌స్ వ్యాపించ‌డంతో ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. వెంట‌నే అప్ర‌మ‌త్తమై చ‌ర్య‌లు తీసుకుంటే ఆ వైర‌స్ క‌ట్ట‌డి అవుతుంద‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ జిల్లాలో ఆందోళ‌న రేగుతోంది.