Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : బస్సు వద్దు .. మన కారే ముద్దు !

By:  Tupaki Desk   |   10 Aug 2020 5:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : బస్సు వద్దు .. మన కారే ముద్దు !
X
కరోనా వైరస్ ... చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి , ఆ తరువాత ఒక్కొక్క దేశం విస్తరిస్తూ ప్రపంచం మొత్తం వ్యాపించింది. కరోనా కారణంగా ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది . అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రజల ఆహార అలవాట్లు, జీవన శైలిలో కూడా భారీ మార్పులకి శ్రీకారం చుట్టింది. మన పక్కన ఉన్న మనిషిని కూడా నమ్మలేని పరిస్థితి. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రూపు రేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి. సిటీ ల్లో ఎన్ని రవాణా సదుపాయాలు ఉన్నా గానీ సరిపోవు. అందుకే ప్రభుత్వాలు వీలనంత వరకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలను కల్పించే ఏర్పాట్లు చేస్తాయి. అందుకే బస్సులు, లోకల్ ట్రైన్స్ మెట్రో రైళ్లు ఇలా అనేక విధాలుగా సౌకర్యాలని ఏర్పాటు చేశాయి. అయితే , ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ట్రాన్స్ ఫోర్ట్ ను నమ్మేస్థితిలో ఎవరు లేరు. దీనితో ప్రజలు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా కొత్త కార్ల అమ్మకాలు జోరు అందుకున్నాయి. గత రెండేళ్లుగా ఇండియన్ ఆటోమొబైల్ రంగం విపరీతమైన మందగమనాన్ని చవిచూసింది. పెరిగిపోతున్న కాలుష్య నిబంధనలు, భారమవుతున్న రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్సు వ్యయం, పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో చాలా మంది వినియోగదారులు సొంత వాహనాల వైపు చూడలేదు. కానీ, కరోనా కారణంగానే పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పక్కనున్న వారితో ప్రయాణం చేయడం మంచిదికాదు అని అనుకుంటున్నారు. అందుకే సొంత కార్ల వైపు చూస్తన్నారు. దీంతో జూన్ నెలతో పోల్చితే జులై లో కార్ల అమ్మకాలు 88% పెరగటం విశేషం.

కొత్త కార్లు కొనాలంటే రూ లక్షల్లో ఖర్చవుతుంది. రుణాలు తీసుకుని కొనుగోలు చేసినా అధిక ఈఎంఐ ల భారం పడుతుంది. కాబట్టి, కాస్త తక్కువ లో వచ్చేలా పాత కార్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నంతలో సెకండ్ హ్యాండ్ కార్ అయినా పర్లేదు కాదు కారు ఉంటే చాలు అనుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ల ను కొంటున్నారు. రూ 50,000 నుంచి రూ 3,00,000 ధరలో లభించే పాత కార్లకు డిమాండ్ అధికంగా ఉంటోందని ఈ వ్యాపారంలో నిమగ్నమైన వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఒకప్పుడు సొంత వాహనాలు, ముఖ్యంగా కార్లు వంటి లగ్జరీ వస్తువులు కొనాలంటే గ్రామాల్లో ఉండే ప్రజలు కాస్త సంకోచించేవారు. కానీ , కరోనా కారణంగా గ్రామాల ప్రజలు కూడా సొంత వాహనాలపై వైపు చూస్తున్నారు. ఏదేమైనా కరోనా కారణంగా ఆటో మొబైల్ రంగం మాత్రం బాగా పుజుకుంది.