Begin typing your search above and press return to search.

దేశానికే అవెంత డేంజర్ స్పాట్లు అంటే?

By:  Tupaki Desk   |   2 April 2020 5:30 PM GMT
దేశానికే అవెంత డేంజర్ స్పాట్లు అంటే?
X
మొదట్లో అడుగులో అడుగు వేసుకుంటూ నడవటం.. నెమ్మది నెమ్మదిగా నడవటం మొదలెట్టి.. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎవరూ ఆపలేనంత వేగంగా దూసుకెళ్లటం కరోనాకున్న అతి గొప్ప లక్షణంగా చెప్పాలి. దేశం ఏదైనా సరే.. కరోనా ఎంట్రీ మాత్రం కూల్ గా అన్నట్లు ఉంటుంది. చిన్న పామును పెద్ద కర్రతోనే కొట్టాలన్న నానుడిని ఏ మాత్రం మిస్ అయినా.. అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు.

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా విషయంలో భారత్ చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. అందుకు తగ్గట్లే కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి. భారత్ లాంటి దేశంలో లాక్ డౌన్ లాంటి అసాధారణ నిర్ణయానికి కరోనా కారణమైందని చెప్పాలి. సమీప భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురు కాదనే చెప్పాలి. కరోనా కేసులు.. ఇటీవల కాలంలో వేగం పుంజుకోవటమే కాదు.. పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.

ఎందుకిలా? జరుగుతోంది? దీనికి కారణం ఏమిటి? దేశంలో కరోనా ఉత్పత్తి కేంద్రాలంటూ ఏమైనా ఉన్నాయా? అంటే.. ఉన్నాయనే మాటను చెబుతున్నారు. దేశ ప్రజలకు డేంజర్ గా ఉండే ఈ ఉత్పత్తి కేంద్రాల్ని ఎంత త్వరగా కంట్రోల్ లోకి తీసుకొస్తే.. కరోనా అపాయం అంత త్వరగా ముగుస్తుందన్న మాట వినిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా ఉన్న ఈ డేంజర్ స్పాట్లలో దేశ రాజధాని ఢిల్లీ.. యూపీ.. కేరళ.. మహారాష్ట్రాల్లో రెండేసి ప్రాంతాలు.. గుజరాత్.. రాజస్థాన్ లలో ఒక్కొక్కటి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఈ డేంజర్ స్పాట్లు ఏమిటి? వాటి కారణంగా దేశంలో కరోనా కేసులు ఎంతలా పెరిగాయన్నది చూస్తే.. ఢిల్లీ మొదటి స్థానంలో నిలుస్తుంది.

నిజాముద్దీన్ లో తబ్లిగీ జమాత్ కు వేలాదిగా హాజరు కావటం.. పలు దేశాలకు చెందిన వారు పాల్గొనటం తెలిసిందే. వీరి కారణంగా పెద్ద ఎత్తున కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ రోజు దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందటానికి.. విస్తరించటానికి.. కారణంగా చెప్పాలి. ఇప్పుడు తెర మీదకు వస్తున్న కొత్త కేసుల్లో అత్యధికం తబ్లిగీ జమాతేనని చెప్పాలి. అదే సమయంలో ఢిల్లీకి చెందిన దిల్షన్ గార్డెన్ లో ఒక మహిళకు సోకిన కరోనా కూడా చాలామందికి వ్యాప్తి చెందటానికి కారణమైంది.

సౌదీకి వెళ్లి వచ్చిన సదరు మహిళ నుంచి.. ఆమె కుమార్తెకు.. మరో ముగ్గురు బంధువులకు సోకింది. అనంతరం వారు సంప్రదించిన వైద్యుడు.. ఆయన సతీమణికి సోకింది. ఇలా పలువురికి వ్యాప్తి చెందటానికి కారణమైంది. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలోని ఒక ప్రైవేటుకంపెనీ పుణ్యమా అని దాదాపు 32 కేసులు వరకూ నమోదైనట్లుగా గుర్తించారు. ఇప్పటివరకూ 626నమూనా పరీక్షలు జరిపారు. 1852 మంది నిఘాలో ఉన్నారు. 300 మంది సెల్ఫ్ క్వారంటైన్ లో ున్నారు. యూపీలోని మీరట్ లో వంద కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని పలుప్రాంతాలుకూడా కరోనా కేంద్రాలుగా గుర్తించారు.

ముఖ్యంగా ముంబయిలోని వర్లి.. కొలివాడ.. గోరెగాంలను కరోనా ఉత్పత్తి కేంద్రాలుగా చెప్పాలి. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైంది ఆ రాష్ట్రంలోనే అన్నది మర్చిపోకూడదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మహారాష్ట్రలో మొదటి కొవిడ్ కేసు నమోదైంది పూణెలో. కానీ.. ఇప్పుడా నగరంలో కరోనా వ్యాప్తి కంట్రోల్ తో ఉండటం గమనార్హం. ఇక.. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇక్కడ రెండు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్.. రాజస్థాన్ లోని భిల్వారా ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం.