Begin typing your search above and press return to search.

సైబర్ వ్యసనంతో పొంచి ఉన్న ప్రమాదం..!

By:  Tupaki Desk   |   9 Dec 2022 11:30 PM GMT
సైబర్ వ్యసనంతో పొంచి ఉన్న ప్రమాదం..!
X
సరదాగా మొదలైన ఇంటర్నెట్ కాలక్షేపం క్రమంగా సైబర్ వ్యసనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. సైబర్ వ్యసనం వల్ల వ్యక్తిగత.. మానవ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ వ్యసనాన్ని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తం లేకుంటే మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ పౌలా గోయెల్ సైబర్ వ్యసనంపై తన అభిప్రాయాన్ని తాజాగా వెల్లడించారు.

సైబర్ వ్యసనాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సైబర్ వ్యసనం అనేది వ్యక్తిగత.. ఉద్యోగ.. మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఇది కేవలం బ్రౌజింగ్ లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడంపై మీదే దృష్టి పెట్టదని క్రమంగా గేమ్‌లు ఆడటం.. జూదం ఆడటం.. ఫోన్లను బలవంతంగా తనిఖీ చేయడం లాంటి వాటికి పురిగొల్పు తుందన్నారు.

నిజమైన స్నేహితుల కంటే ఆన్‌లైన్ స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేలా చేస్తుందని తెలిపారు. ఆన్ లైన్ లో ఎక్కువ సమయం గడిపే వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పుడు వారిలో మానసిక స్థితి.. విచారం.. చిరాకులుగా మారుతుందని వెల్లడించారు. ముఖ్యంగా 15 నుంచి 16 ఏళ్ళ మగవారిలో ఈ సైబర్ వ్యసనం ఎక్కువగా కన్పిస్తుందని తెలిపారు.

ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడటం ద్వారా ఉద్యోగం.. విద్య లేదా వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇంటర్నెట్ వ్యసనం ఉన్న వ్యక్తుల్లోని మెదడులో న్యూరో-అనాటమికల్ కారకాలు డ్రగ్స్ లేదా జూదం అలవాటు ఉన్న వ్యక్తుల మాదిరిగానే మార్పులను సూచిస్తున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.

ఈ వ్యసనం ఉన్నవారిలో తినడం లేదా నిద్రపోవడం వంటి ప్రాథమిక రోజువారీ విషయాల కంటే కూడా ఇంటర్నెట్ కే ప్రాధాన్యం ఇస్తున్నారని తేలింది. ఎక్కువ గంటలు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (చేతులు మరియు మణికట్టులలో నొప్పి మరియు తిమ్మిరి) వంటి శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తుందట.

పొడి కళ్ళు.. వెన్నునొప్పి.. మెడ నొప్పులు.. తీవ్రమైన తలనొప్పి.. నిద్రలేమి.. బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం.. డిప్రెషన్.. మానసిక ఆందోళన.. అపరాధ భావాలు.. మానసిక ఒత్తిడి వంట సమస్యలు తలెత్తున్నాయని పేర్కొన్నారు. విచారంగా ఉన్న సమయంలో లైంగిక సంతృప్తి లేదా ఉత్సాహం కోసం ఇంటర్నెట్‌ను అవుట్‌ లెట్‌గా ఉపయోగిస్తున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుందని వెల్లడించారు.

ఏది ఏమైనా అతి అనేది ఎప్పుడు కూడా అనర్ధదాయకం కావున ఇంటర్నెట్ ను అవసరానికి మాత్రం ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీలో ఎవరైనా ఇప్పటికే సైబర్ వ్యససం బారిన పడితే క్రమంగా వాటి నుంచి దూరంగా ఉండటం మంచిది. లేనట్లయితే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.