జనవరి 22 మంగళవారం 2019 దినఫలాలు

Tue Jan 22 2019 07:00:26 GMT+0530 (IST)

Daily Rashi Phalalu

గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.మేష రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రియల్టర్లు కాంట్రాక్టర్లకు ఇబ్బందులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీ సూచనలు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి నిరాశాజనకం. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు నిరుత్సాహం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృషభ రాశి: ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. అందరిలో గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులు ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మిత్రులు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. గణపతిని ఆరాధించడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలం. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు అధికం. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ముందుకు సాగవు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

కర్కాటక రాశి: బాకీలు వసూలవుతాయి. రాబడి ఆశాజనకం. సంఘంలో మీకు ఎదురుండదు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలుంటాయి. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి అన్నింటా అనుకూలమే. ఐటీ నిపుణులకు మరింత అభివృద్ధి. విద్యార్థులకు సంతోషకరమైన కాలం. రియల్ ఎస్టేట్ వారు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

సింహ రాశి: ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు తప్పవు. అనుకోని ఖర్చులు. వ్యవహారాల్లో ఆటుపోట్లు. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి అధిక బాధ్యతలు. ఐటీ ఉద్యోగులకు అవకాశాలు చేజారతాయి. విద్యార్థులకు పరీక్షా కాలం. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తప్పవు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు అమలు చేస్తారు.  సంఘంలో ఆదరణ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి లాభాలు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. రాబడి పెరుగుదల సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక కళారంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులు లక్ష్యం కోసం పాటుపడుతారు. మహిళలకు కుటుంబీకుల నుంచి చేయూత లభిస్తుంది. గణపతిని పూజించడం మంచిది.

తులారాశి: సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్యలు తొలగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు పురోగతిలో ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహం కలిగించే ప్రకటన రావచ్చు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమాచారం అందుతుంది. మహిళలకు ఉత్సాహంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది.

వృశ్చిక రాశి: శ్రమతో పనులు పూర్తి చేస్తారు. సోదరులతో కలహాలు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. రియల్  ఎస్టేట్ వారు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. వ్యాపార లావాదేవీలకు అనుకూల సమయం. ఉద్యోగుల శ్రమకు ఫలితం దక్కదు. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. విద్యార్థులు  ఐటీ నిపుణులకు నిరాశాజనకం. దుర్గాదేవీని పూజించడం మంచిది.

ధనస్సు రాశి: ఆదాయం నిరాశాజనకం. బంధుమిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాల్లో పొరాపాట్లు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీయానంలో అవరోధాలు. ఐటీ నిపుణులకు మార్పులు తథ్యం. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టలు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక అశాంతి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మకర రాశి: బాకీలు వసూలవుతాయి. ఎంతటి వారైనైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగుతాయి.  వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామిక రాజకీయరంగాల వారికి ఊహించని వ్యవహారాలు పూర్తి. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మహిళలకు కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. శ్రీరామ స్తోత్రాలు పఠనం చేయడం మంచిది.

కుంభరాశి: ఆదాయం నిరాశాజనకం ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపొట్లు  ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ల అంచనాలు తారుమారవుతాయి. ఉద్యోగులకు పనిభారంతో చికాకులు. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీయానంలో అవరోధాలు. ఐటీ ఉద్యోగులకు మార్పులు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. మహిళలకు మానసిక అశాంతి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మీనరాశి: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు తప్పవు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులుంటాయి. రాజకీయ - కళారంగాల వారికి అంతగా ప్రోత్సాహం ఉండదు. ఐటీ ఉద్యోగులకు కొత్త వివాదాలు. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కదు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.