Begin typing your search above and press return to search.

ముంబై లో మాయమౌతున్న అమ్మాయిలు ... ఏమై పోతున్నారంటే ?

By:  Tupaki Desk   |   20 Nov 2019 6:53 AM GMT
ముంబై లో మాయమౌతున్న అమ్మాయిలు ... ఏమై పోతున్నారంటే ?
X
ముంబై దేశ ఆర్థిక రాజధాని ..నిత్యం కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. అలాగే అంత కంటే ఎక్కువ గానే క్రైమ్ కూడా జరుగుతోంది. బిజీ జీవితం లో పక్కనున్న వారు ఎవరు అని కూడా పట్టించుకోక పోవడం తో మాఫియాలు తమ పనిని కూల్ గా చేసుకుంటూ పోతున్నాయి. ఇక పోతే ముంబై గురించి తాజాగా ఒక విషయం బయటకి వచ్చింది. అదేమిటంటే .. ప్రతి రోజు సరాసరి ముంబై లో నలుగురు అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది మైనర్లే కావడం మరో విశేషం. 15–17 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నారు.

ముంబై లో మైనర్‌ బాలికలు అపహరణకు గురికావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు 10 నెలల్లో ఏకంగా 1,141 మైనర్‌ బాలికలు అపహరణకు గురైనట్లు వివిధ పోలీసు స్టేషన్‌ల లో కేసులు నమోదయ్యాయి. అందులో 912 కేసులని పోలీసులు ఛేదించారు. మైనర్‌ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ అపహరణ కేసులను సీరియస్‌ గా తీసుకుంటున్నారు. కాని పట్టుబడిన తరువాత చేపట్టిన విచారణ లో పెళ్లి పేరట మోసపోయిన కేసులే అధికంగా వెలుగులోకి వస్తున్నాయి.

ఆలా అపహరణకు గురైన కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు పరువు పోతుందని, అలాగే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదులు చేయడానికి వెనకడగు వేస్తున్నారు. కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ తరువాత ఉప సంహరించుకుంటున్నారు. మోసపోయిన వారిలో అధికంగా కాలేజీల కు వెళ్లే బాలికలే ఉన్నారు. నేటి సినిమాల ప్రభావం కూడా మోసపోవడానికి కారణం అని , అలాగే పిల్లలపై తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, అత్యాచారం చేసి ఆ తరువాత బ్లాక్‌ మెయిల్‌ చేయడం, సోషల్‌ మీడియాను అతిగా వాడడం కూడా ఒక కారణమే అని పోలీసులు చెప్తున్నారు.