సీఎం పోస్టును మాత్రమే నేను చేయలేదు..నన్నే అవమానిస్తారా?

Thu Oct 10 2019 17:03:11 GMT+0530 (IST)

Daggubati Venkateshwar Rao Unsatified With YSRCP Hicommand

ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు సరై ప్రాధాన్యత దక్కడం లేదనే భావనతో ఉన్నారట ఆయన. ప్రత్యేకించి తన నియోజకవర్గంలో తాజాగా ఒక చేరిక పట్ల ఆయన మండిపడుతూ ఉన్నారట.ఎన్నికల సమయంలో దగ్గుబాటికి సహకరించకుండా వ్యవహరించిన ఒక వ్యక్తిని ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ విషయంలో దగ్గుబాటి బాగా అసహనంతో ఉన్నట్టుగా సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గాలిలో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలవలేకపోయిన సంగతి తెలిసిందే. దానికి కారణం పార్టీని వీడిన అసంతృప్త వాదులే అని దగ్గుబాటి అనుకుంటున్నారట. తన ప్రత్యర్థి గెలుపుకు వారు పని చేశారనేది ఆయన ఆరోపణ.ఇప్పుడు అలాంటి వారు పార్టీలోకి తిరిగి వస్తూ ఉన్నారు. వారిని చేర్చుకోవడం దగ్గుబాటికి ఇష్టం లేదని తెలుస్తోంది.

ఈ నేఫథ్యంలో ఇటీవలే తన వర్గం వాళ్లతో సమావేశం నిర్వహించి అసహనం వ్యక్తం చేశారట దగ్గుబాటి. తనకు ప్రత్యామ్నాయం రెడీగా ఉందంటూ పార్టీ సంకేతాలను ఇస్తున్నట్టుగా ఉందని - తోకాతొండం లేని వారిని పార్టీలోకి తీసుకుని - తనను టెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ.. దగ్గుబాటి తన అనుచవర్గం వద్ద వ్యాఖ్యానించారని సమాచారం!