60 రోజుల్లో 12 క్షిపణులను పరీక్షించిన డీఆర్డీఏ.. ఆశ్చర్యంలో అగ్రదేశాలు!

Thu Oct 29 2020 14:20:32 GMT+0530 (IST)

DRDA tests 12 missiles in 60 days

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పనితీరుకు అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కేవలం గత రెండు నెలల్లోనే డీ ఆర్ డీ ఏ 12 క్షిపణులను పరీక్షించి యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రమ్ నుంచి బ్రహ్మోస్ వరకు అనేక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.. మొత్తంగా 12 క్షిపణులను కేవలం రెండు నెలల వ్యవధిలోనే విజయవంతంగా పరీక్షించింది. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖవద్ద  భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే డీఆర్డీఏ క్షిపణులను పరీక్షించింది.నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి  డీ ఆర్ డీ ఏ అభివృద్ధి చేసిన నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ చివరి ట్రైట్ను అక్టోబర్ 22న విజయవంతంగా పరీక్షించారు. ఈ వెపన్ సిస్టమ్ భారత ఆర్మీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. స్టాండ్ ఆఫ్ యాంటీ టాక్ (ఎస్ఏఎన్టీ) మిస్సైల్‌ను అక్టోబర్ 19న పరీక్షించారు.

భారత వైమానిక దళం కోసం ఈ క్షిపణిని రూపొందించారు. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్.. అక్టోబర్ 18న విజయవంతంగా పరీక్షించింది డీ ఆర్ డీ ఏ. ఈ క్రూయిజ్ క్షిపణిని అరేబియా సముద్రంలో ఓ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పరీక్షించారు. భారత మొట్టమొదటి స్వదేశీ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రమ్1 కొత్త జనరేషన్‌ను వైమానికదళం కోసం రూపొందించారు. ఈ క్షిపణిని అక్టోబర్ 9న బాలాసోర్ లోని ఐటీఆర్‌లో పరిక్షీంచారు.

డీఆర్డీవో స్వదేశీ టెక్నాలజీతో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కోసం స్మార్ట్ టార్పెడో సిస్టమ్ రూపొందించింది. యాంటీ సబ్ మెరైన్ యుద్ధ సమయాల్లో ఇది గేమ్ ఛేంజర్‌గా వినియోగించుకోవచ్చు. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టోర్ పెడోను  డీఆర్డీఓ విజయంతంగా పరీక్షించింది. న్యూ క్లియర్ క్యాపబుల్ హైపర్ సోనిక్ మిస్సైల్ శౌర్య.. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు.

ఈ క్షిపణిని అక్టోబర్ 3న ఒడిశా తీరంలోని రేంజ్ నుంచి పరీక్షించారు. వీటితో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి  అభ్యాస్ హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికిల్ స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ తదితర క్షిపణులను డీఆర్డీఏ పరీక్షించింది.