Begin typing your search above and press return to search.

ఎమ‌ర్జెన్సీకి హైజాక్‌ కు తేడా తెలియ‌దు..పైల‌ట్ క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   21 July 2019 1:30 AM GMT
ఎమ‌ర్జెన్సీకి హైజాక్‌ కు తేడా తెలియ‌దు..పైల‌ట్ క‌ల‌క‌లం
X
కుడి ఎడ‌మైతే...పొర‌పాటు లేదోయ్ అనేది పాట‌ రూపంలో పాడుకునేందుకు బాగానే ఉంటుంది. కొన్ని ఉద్యోగాల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే...పొర‌పాటు సంగ‌తి దేవుడెరుగు...వంద‌ల కొల‌ది ప్రాణాలు పోయే ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. సున్నిత‌మైన‌ - జాగ్ర‌త్త‌ల‌కు సంబంధించిన ఉద్యోగమైన పైల‌ట్ విష‌యంలో అత్యుత్సాహం - ఆందోళ‌న వ‌ల్ల ఓ పైల‌ట్ క‌ల‌క‌లం సృష్టించారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ నగరానికి వస్తున్న విమానం హైజాక్ అయిందంటూ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసుకు ‘హైజాక్ కోడ్’ పంపించాడు. ఎమ‌ర్జెన్సీ బ‌ట‌న్ నొక్కాల్సింది పోయి హైజాక్ అయిందంటూ ఆ పైలెట్ నిర్వాకం సంచలనం రేపింది.

గ‌త నెల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఎయిర్ ఏసియా విమానం జూన్ నెల 9వ తేదీన ఢిల్లీ నుంచి శ్రీనగర్ బ‌య‌ల్దేరింది. ఈ స‌మ‌యంలో ఓ ఇంజిన్ ఆగిపోయింది. దీంతో విమాన కెప్టెన్ రవిరాజ్ ఎమర్జెన్సీ కోడ్ 7700 కోడ్ నొక్కబోయి - పొరపాటున హైజాక్ కోడ్ 7500 హైజాక్ కోడ్ నొక్కారు. దీంతో - శ్రీనగర్‌ లోని ఎయిర్ ట్రాఫిక్ సర్వీసు అప్రమత్తమై సెక్యూరిటీకి సమాచారం అందించింది. అనంత‌రం ప‌రిస్థితులు స‌మీక్షించ‌గా - ఎమ‌ర్జెన్సీ కోడ్ నొక్కార‌ని తేల్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, పైల‌ట్ చ‌ర్య‌ను నిర్ల‌క్ష్యంగా తీసుకొని వ‌దిలివేయ‌కుండా హైజాక్ కోడ్ నొక్కిన పైలెట్ రవిరాజ్ కు పౌరవిమానయాన సంస్థ డైరెక్టరు జనరల్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ షోకాజ్‌ నోటీసుపై కెప్టెన్ రవిరాజ్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని డీజీసీఏ అతన్ని మూడు నెలలపాటు పైలెట్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఎయిర్ ఏసియా విమానం ఫైలెట్ ఇన్ కమాండ్ కెప్టెన్ కిరణ్ సంగ్వాన్‌ కు డీజీసీఏ హెచ్చరిక జారీ చేసింది. కాగా, ఎంతో అల‌ర్ట్‌ గా ఉండాల్సిన పైల‌ట్ త‌న నిర్ల‌క్ష్యం వ‌ల్ల హైరానా సృష్టించ‌డంతో పాటు మూడునెల‌ల పాటు విధుల‌కు దూరంగా ఉండిపోయార‌ని అంటున్నారు.