Begin typing your search above and press return to search.

దమానీ మ్యాజిక్‌: లాక్‌ డౌన్‌ లోనూ లాభాల్లో డీమార్ట్‌..!

By:  Tupaki Desk   |   9 April 2020 1:30 AM GMT
దమానీ మ్యాజిక్‌: లాక్‌ డౌన్‌ లోనూ లాభాల్లో డీమార్ట్‌..!
X
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశంలో లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో దేశంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. వాణిజ్య - మార్కెట్‌ ప్రాంతాలన్నీ బోసిపోయాయి. ఈ సమయంలో చిల్లర వర్తకం మాత్రమే కొనసాగుతోంది. నిత్యావసర సరుకుల దుకాణాలుగా ఉన్న సూపర్‌ మార్కెట్లు మాత్రం కొనసాగుతున్నాయి. అందులో నామమాత్రం వ్యాపారం సాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్ కొనసాగుతున్న సమయంలోనూ డీమార్ట్‌ మాత్రం లాభాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థ సూపర్‌ మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. నిత్యావసర వస్తువులతో పాటు మిగతా వస్తువుల వ్యాపారం కొనసాగించే డీమార్ట్‌ కు ప్రజలు భారీగా వెళ్తున్నారు.

మిగతా సూపర్‌ మార్కెట్ల పరిస్థితి ఘోరంగా ఉండగా డీమార్ట్‌ కేంద్రాలు మాత్రం కొనుగోళ్లతో బిజీబిజీగా ఉన్నాయి. దీంతో ఎవెన్యూ సూపర్ మార్కెట్ల అధినేత రాధాకిషన్ దమానీ లాభాలు పొందుతున్నారు. ఆ సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగిపోతోంది. దేశంలోనే సంపన్నుల్లో దమానీ ఒకరు. టాప్‌ 12 మంది భారతీయుల్లో దమానీ ఒకరిగా ఉన్నారు. ఆయన దాయం 10.2 బిలియన్ డాలర్ల మేర ఉంది. ఇప్పుడు 5 శాతానికి పెరిగింది. ఎవెన్యూ సూపర్ మార్కెట్ల షేర్లు ఈ సంవత్సరం 18 శాతం హెచ్చుదలను నమోదు చేసుకోవడం విశేషం. ఆయన సూపర్ మార్కెట్ లతో బిలియనీర్‌ గా ఎదిగాడు. మూడు వారాల పాటు దేశంలో లాక్‌ డౌన్ కొనసాగుతున్నా కూడా దమానీ వ్యాపారం మాత్రం లాభాలు పొందుతున్నాడు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఈ మార్కెట్లకు వెళ్తుండడంతో సాధారణ పరిస్థితుల్లో మాదిరి ఆయన వ్యాపారం కొనసాగుతోంది.

ఒకప్పుడు ముంబైలో ఓ చిన్న గదిలో నివసిస్తూ వ్యాపారం మొదలుపెట్టిన రాధాకిషన్ నేడు భారతదేశంలో అపర కుభేరుల్లో ఒకడిగా నిలిచాడు. ఎవెన్యూ సూపర్ మార్కెట్ల రాయితీ వ్యాపారంగా ఉన్న డీ-మార్ట్ సంస్థలను ఆయన నడిపిస్తున్నాడు. ఆ సంస్థకు చెందిన మార్ట్‌ లు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర - గుజరాత్ - మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో దేశం మొత్తం 206 శాఖలు ఉన్నాయి. కరోనా నివారణ కోసం దమానీ పీఎం కేర్స్ ఫండ్‌ కు రూ.వంద కోట్ల విరాళం ప్రకటించారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తరువాత దమానీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.