Begin typing your search above and press return to search.

ఇండియ‌న్‌ షేర్ మార్కెట్ పై సైబ‌ర్ దాడి.. 25 ల‌క్ష‌ల మంది డేటా చోరీ!

By:  Tupaki Desk   |   13 April 2021 12:30 AM GMT
ఇండియ‌న్‌ షేర్ మార్కెట్ పై సైబ‌ర్ దాడి.. 25 ల‌క్ష‌ల మంది డేటా చోరీ!
X
దేశీయ స్టాక్ మార్కెట్ పై సైబ‌ర్ ఎటాక్ జ‌రిగింది. దేశంలోనే రెండో అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ ఫామ్ నుంచి ఏకంగా 25 ల‌క్ష‌ల మంది డేటా చోరీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎంతో ప‌క‌డ్బందీగా ఉండే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఛేదించి మ‌రీ ఈ స‌మాచారం కొట్టేశారు హ్యాక‌ర్లు. ప్ర‌స్తుతం ఇందులో కొంత మొత్తాన్ని ‘డార్క్ వెబ్’ లో వేలానికి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇండియాలో రెండో అతిపెద్ద స్టాక్ బ్రోక‌ర్ ‘అప్ స్టాక్స్’ రిటైల్ బ్రోకింగ్ ఫామ్ పై ఈ దాడి జ‌రిగింది. అయితే.. ఇన్వెస్ట‌ర్లు భ‌య‌ప‌డాల్సింది ఏమీ లేద‌ని, స‌మాచారం అంతా క్షేమంగానే ఉంద‌ని సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో ర‌వికుమార్ ప్ర‌క‌టించారు.

సెక్యూరిటీస్ తోపాటు క‌స్ట‌మ‌ర్ల ఫండింగ్ అంతా భ‌ద్రంగా ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ డేటాకు సంబంధించిన శాంపిల్ ను మాత్ర‌మే హ్యాక‌ర్లు డార్క్ వెబ్ లో ఉంచార‌ని చెప్పారు. అయితే.. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా అంద‌రికీ సెక్యూర్ పాస్ వ‌ర్డ్ ఇస్తున్నామ‌ని, అదేవిధంగా.. ఓటీపీతోనే ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగేలా చూస్తున్నామ‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపై రోజంతా మానిట‌రింగ్ చేస్తున్నామ‌ని, ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు.

కాగా.. ఈ దాడి విషయం తెలుసుకొని ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ డబ్బుల గురించి, అకౌంట్ డీటెయిల్స్ గురించి భయపడుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కంపెనీని కోరుతున్నారు.