Begin typing your search above and press return to search.

కర్ఫ్యూ ఉల్లంఘన ... వారితో పోలీసులు ఏం చేయించారంటే ?

By:  Tupaki Desk   |   4 May 2021 12:30 PM GMT
కర్ఫ్యూ ఉల్లంఘన ... వారితో పోలీసులు ఏం చేయించారంటే ?
X
దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోవడంతో కరోనా మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్‌ డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనితో లాక్‌ డైన్‌ ఆంక్షలను అతిక్రమించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కరోనా కర్ఫ్యూను బేఖాతారు చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు మధ్యప్రదేశ్‌ అధికారులు వినూత్నంగా రీతిలో శిక్ష విధించారు.

ఇండోర్‌ జిల్లాలోని డెబల్పూర్‌ లోని పోలీసులు కరోనా కర్ఫ్యూ సందర్భంగా వీధుల్లో తిరుగుతున్న వారిని రోడ్డుపై కప్ప గంతులు వేయించారు. దీనికి తోడు డప్పు చప్పుళ్లు నడుమ వారిని గ్రామంలో కొంతదూరం పరిగెత్తేలా చేశారు. పరిమితికి మించి ఆదివారం సాయంత్రం పెళ్లి నుంచి బైక్‌, కార్లలో వెళుతుండగా పోలీసులు వీరిని గుర్తించి ఈ శిక్ష వేశారు. ఇలా చేయడం వల్ల ఇతర వ్యక్తులు కోవిడ్‌ రూల్స్‌ ఉల్లంఘించకుండా ఉంటుందని ఆ ప్రాంత తహసీల్దార్‌ జబరంగ్‌ బహదూర్‌ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కాగా ఇప్పటికే కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిపాల్పూర్‌ లో కరనా కర్ఫ్యూ విధించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుటోంది. ఇక ఆదివారం మధ్యప్రదేశ్‌లో 12,662 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది ప్రాణాలు కోల్పోయారు.