Begin typing your search above and press return to search.

అమెరికాలో సంక్షోభం: భారీగా ఉద్యోగాలు మానేస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Jun 2021 1:30 PM GMT
అమెరికాలో సంక్షోభం: భారీగా ఉద్యోగాలు మానేస్తున్నారు
X
గడిచిన రెండు దశాబ్దాల్లో ఎక్కువ మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను విడిచిపెట్టినట్టు సంచలన నివేదిక బయటపెట్టింది. దీంతో అమెరికాలో కంపెనీలు పెట్టి ఆర్థిక పునరుద్ధరణను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్న సంస్థలకు సవాల్ గా మారిందని ఒక మీడియా నివేదిక తెలిపింది.

"రాజీనామాల పరంపర కరోనా మహమ్మారి వెలుగుచూశాక మరింత ఎక్కువైందని.. కంపెనీలకు మానవ వనరుల కొరత తీవ్రమైందని’ మీడియా నివేదిక తెలిపింది. జాతీయ ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది కార్మికులు ఉద్యోగ భద్రతను కోరుకున్నారు" అని జిన్హువా వార్తా సంస్థ ఆదివారం వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ పేర్కొంది.

కార్మిక శాఖ నుంచి.. వచ్చిన డేటాను ఉటంకిస్తూ గత సంవత్సరం ఏప్రిల్‌లో అమెరికా కార్మికుల వాటా 2.7 శాతంగా ఉండగా ఈ ఏడాదికి అది 1.6 శాతంకు పడిపోయిందని తెలిపారు. అత్యధిక స్థాయిలో కార్మికుల కొరత అమెరికాను వెంటాడుతోందని నివేదిక పేర్కొంది.

అధిక నిష్క్రమణ రేటు వల్ల ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలో అధిక ఖర్చులతో కార్మికులను నియమించుకొని వేతనాలు ఇస్తూ నష్టపోతున్నారని తెలిపాయి. కొన్ని సందర్భాల్లో, వ్యాపార అంతరాయాలతో కార్మికులు, వారి నైపుణ్యాలు, ఆసక్తులు.. వ్యక్తిగత జీవితాలను చూసుకుంటూ తగిన ఉద్యోగాలు వెతుక్కుంటూ ఆకర్షితులవుతున్నందున కార్మిక ఉద్యోగం వదిలేస్తున్నారని నివేదికలో తేలింది. కార్మిక మార్కెట్‌ అమెరికాలో క్షీణిస్తోందని కార్న్ ఎకనామిస్ట్స్ చెప్పారు. .

అనేక కారణాలు ఉద్యోగుల భర్తీని పెంచుతున్నాయి. చాలా మంది ప్రజలు యథావిధిగా వ్యాపారానికి తిరిగి వస్తున్నారు. రిమోట్ పనులను చేయడానికి ఇష్టపడడం లేదు. కరోనా వైరస్ తగ్గినా ఇప్పటికీ కంపెనీల్లో పనిచేయడానికి ఉండటానికి ఇష్టపడరు.

"ఇప్పటికే కరోనాతో కొందరు చనిపోయారు. పనిభారం మరియు ఒత్తిడి నుండి తట్టుకోలేక వదిలేస్తున్నారు. మరికొందరు జీవిత భాగస్వాములతో సమస్యల వల్ల ఉద్యోగాలు వదిలేస్తున్నారు. కుటుంబ పోరుతో అధిక వేతనం కోసం చూస్తున్నారు. గత సంవత్సరం వారి కెరీర్ జీతం చూసుకొని తొందరగా పెద్ద జాబ్ చూసుకొని పోతుండడంతో కార్మికుల కొరత తీవ్రమైందని" నివేదిక పేర్కొంది.