Begin typing your search above and press return to search.

ఒంటినిండా టాటూస్.. మదినిండా క్రైమ్..: అమెరికా కాల్పుల నిందితుడి ఫ్రొఫైల్

By:  Tupaki Desk   |   6 July 2022 5:13 AM GMT
ఒంటినిండా టాటూస్.. మదినిండా క్రైమ్..: అమెరికా కాల్పుల నిందితుడి ఫ్రొఫైల్
X
ప్రపంచ పెద్దన్నగా పేరున్న అమెరికాలో జనజీవనం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఎటునుంచి ఎవరు కాల్పులు జరుపుతారోనన్న భయం ప్రతి ఒక్కరిలో పట్టుకుంది. దాదాపు సంవత్సర కాలంగా విచక్షణ రహితంగా చాలా మంది కాల్పులు జరుపుతున్నారు. కారణం పెద్దగా లేకపోయినా చేతిలో గన్ పట్టుకొని తిరుగుతున్నారు.తాజాగా సోమవారం దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగి ఉండగా ఓ యువకుడు గన్ కు పనిచెప్పాడు. అలా ఆరుగురిని బలిగొన్నాడు. దాదాపు 36 మందిని గాయాలపాలు చేశాడు. అయితే అతికష్టం మీద అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తరువాత విచారించగా అతని బ్యాక్రౌండ్ గురించి విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.

అమెరికాలో తాజాగా ఓ యువకుడు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఆ యువకుడి పేరు రాబర్ట్ బాబీ క్రైమో. రాబర్ట్ బాబీ గురించి ప్రపంచం మొత్తానికి తెలియకపోయినా ఆ దేశ ప్రజలకు సుపరిచితుడే. అతనో యూట్యూబ్ చానెల్ పెట్టి ఫేమస్ అయ్యాడు.

అయితే తన యూట్యూబ్ ఛానెల్ లో మొత్తం హింసాత్మక వీడియోలే. కాల్పులు, చావులు, హింసకు సంబంధించిన వీడియోలను చేస్తూ రాబర్ట్ ఫేమస్ అయ్యాడు. అలా క్రైమ్ మెంటాలిటీ ఉన్న రాబర్టే చికాగోల జరిగిన కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

రాబర్ట్ క్రైమ్ వయసు చాలా చిన్నది. కానీ ఆయన మెండ్ సెట్ మొత్తంగా క్రైమ్ తో నిండింది. ఇతను చేసిన ఎన్నో వీడియోలను యూట్యూబ్ నిబంధనల కింద తీసేసింది. అయినా హెల్మెట్, బల్లెట్ ఫ్రూప్ కోట్ ధరించి తరగతిలో యువతను రెచ్చగొట్టే వీడియోలను చాలానే తీశాడు. ఒంటినిండా టాటూలతో విచిత్రమైన వేషధారణతో కనపించినే ఈయన భయంకరంగా మారాడు. ఆ టాటూస్ లోనూ హింసా ధోరణి కనిపిస్తుందని పోలీసులు తెలుపుతున్నారు.

ఇక చికాగోలో జరిగిన సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ హోండా ఫిట్ కారు రూట్ టాప్ నుంచి హై పవర్డ్ రైఫిల్ తో రాబర్ట్ కాల్పలు జరిపాడని అంటున్నారు. అయితే కాల్పులు జరిపిన తరువాత అతని కోసం ఐదు మైళ్ల పాటు చేజ్ చేయాల్సి వచ్చింది.

మొత్తానికి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో కొన్ని నెలలుగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. నెల రోజుల కిందట ఓ యువకుడు స్కూల్ లో కాల్పులు జరిపాడు. అంతకుముందు రెస్టారెంట్లో.. ఇలా ఎప్పుడు ఎవరు గన్ కు పనిచెబుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది.