Begin typing your search above and press return to search.

డెబిట్, క్రెడిట్ కార్డు వాడే వారికి హెచ్చరిక..అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 AM GMT
డెబిట్, క్రెడిట్ కార్డు వాడే వారికి హెచ్చరిక..అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
X
మీకు బ్యాంక్‌ లో అకౌంట్ ఉందా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటివి వాడుతున్నారా, అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 లోపు ఒక పని పూర్తి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఎందుకంటే వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఖాతాదారులు వారి బ్యాంక్ అకౌంట్‌ తో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్‌ ను ఇప్పుడు ఉపయోగించకపోతే,ప్రస్తుతం వాడుతున్న నెంబర్‌ తో కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌ ను అప్‌ డేట్ చేసుకోవాలి.

అలాగే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా రికరింగ్ పేమెంట్లు చెల్లించే వారు కూడా కార్డులతో లింక్ అయిన మొబైల్ నెంబర్ తమ వద్దే ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే ఆటో డెబిట్ ఫెసిలిటీకి ఆర్‌ బీఐ నిర్దేశించిన అడిషనల్ అథంటికేషన్ రూల్ వచ్చే నెల అమలులోకి వస్తుంది. అంటే ప్రతి ఆటో డెబిట్, రికరింగ్ ట్రాన్సాక్షన్‌ కు కస్టమర్ అనుమతి కచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే ఆ లావాదేవీలు పూర్తవుతాయి. అంటే పేమెంట్ చెల్లింపు ప్రతిసారి కస్టమర్లకు ఓటీపీ వస్తుంది. అందువల్ల మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా జరిపే రూ.5 వేలకు పైన ఆటో డెబిట్ లావాదేవీలకు కొత్త రూల్ వర్తిస్తుంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌ స్స్ర్కిప్షన్‌, మొబైల్‌ బిల్‌ పేమెంట్స్‌, ఇన్సురెన్స్‌ ప్రీమియమ్‌, యుటిలిటీ బిల్స్‌ ఈ పరిధిలోకి వస్తాయి. ఐదు వేల లోపు చెల్లింపుల మీద, అలాగే ‘వన్స్‌ ఓన్లీ’ పేమెంట్స్‌ కు సైతం కొత్త నిబంధనలు వర్తించవు. గడువు తర్వాత తాముపేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ. హోం లోన్స్‌ ఈఎంఐగానీ, ఇతరత్ర పేమెంట్స్‌గానీ ఐదువేల రూపాయలకు మించి ఆటోడెబిట్‌ మోడ్‌లో కట్‌ అయ్యేవిధంగా కొందరు సెట్‌ చేసుకుంటారు కదా. అయితే వీళ్లు ఇకపై మ్యానువల్‌ గా అప్రూవ్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానుండగా.. యూజర్ల నెత్తిన పిడుగు తప్పదనే మరోప్రచారం మొదలైంది.

ఈ తరహా పేమెంట్స్‌కు యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే కథనాలు కొన్ని జాతీయ మీడియా వెబ్‌ సైట్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఆర్బీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నిబంధన అమలుపై మల్లగుల్లాలు చేస్తున్నాయి. నిజానికి యూజర్ల భద్రత అంశం, ఆన్‌లైన్‌ మోసాల కట్టడి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ నిబంధనను రెండేళ్ల క్రితమే ప్రతిపాదించింది. ఏప్రిల్‌ 1, 2021 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంది. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు కొంత గడువు కోరడంతో.. ఇప్పుడు అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నిబంధన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.