నిజం... ఆవు పేడతో రేడియేషన్‌కి చెక్!

Mon Feb 22 2021 22:00:01 GMT+0530 (IST)

Cow dung chip reduces radiation from mobiles

నేటి తరానికి ఆవు పేడ వినియోగం గురించి పెద్దగా తెలియదు. కానీ ఓ 15 ఏళ్ల కిందటకి వెళ్తే.. ఇప్పట్లా.. కాంక్రీట్ జంగిళ్లు వెలవకముందు.. ఆవు పేడతో కళ్లాపి చల్లుకుని.. ఆవు పేడ పిడకలతో నీళ్లు కాచుకుని.. ఇలా అనేకసందర్భాల్లో ఆవు పేడను వినియోగించేవారు. ఆవు పేడకు నిరోధక శక్తి ఉందని పెద్దలు చెప్పేవారు. అయితే.. నేటి తరం.. ఆవు పేడను పట్టించుకోవడం మానేయడంతోపాటు.. అసలు దీని గురించి ప్రస్తావించేవాతావరణం కూడా లేకుండా పోయింది. ఏటా సంక్రాంతి నాడు మాత్రం గొబ్బెమ్మల్లో ఆవుపేడను చూసుకుని మురిసిపోవడం తప్ప!అయితే.. ఆవుపేడతో అత్యంత కీలకమైన రేడియేషన్ అనర్థం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా చెప్పుకొచ్చారు. ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి రక్షణ కల్పించే శక్తి ఆవుపేడకు ఉందని అంటున్నారు. అంతేకాదు భారత్ రష్యాల్లోని అణుకేంద్రాల్లో.. రేడియేషన్ నియంత్రణకు ఆవుపేడను వాడుతున్నారని కూడా చెబుతున్నారు. కేంద్ర పశుసంర్థక శాఖ పరిధిలోని `రాష్ట్రీయ కామధేను ఆయోగ్` సంస్థ గో విజ్ఞానం(కౌ సైన్స్) పేరుతో దేశవ్యాప్తంగా ఆవు పేడ ప్రాధాన్యాన్ని వివరిస్తోంది.

1980లలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఆవు పేడ కారణంగా చాలా ప్రాణాలు నిలిచాయని ఈ సంస్థ పేర్కొనడం గమనార్హం. భారతీయ ఆవులపై ఉండే మూపురాలకు ప్రత్యేక శక్తి ఉందని వెల్లడించింది. మూపురాల్లోని శక్తి సూర్యకిరణాలను శక్తిమంతంగా మారుస్తుందని అందుకే ఆవుపాలు పసుపువర్ణంలో ఉంటాయని స్పష్టం చేసింది. ఆవు పాలలో ఉండే ఔషధ గుణాలు అనేక రోగాలను సైతం రూపుమాపుతాయని ఈ సంస్థ వెల్లడించింది. ఇటీవల ఆవు నుంచి ఉత్పత్తి అయ్యే వివిధ రకాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించే కార్యక్రమాలకు ఈ సంస్థ శ్రీకారం చుట్టడం గమనార్హం. అయితే.. ఎప్పట్లానే.. కొందరు ప్రొఫెసర్లు.. విద్యాసంస్థలు మాత్రం.. ఇదో మూఢనమ్మకమని కొట్టి పారేస్తుండడం గమనార్హం.