Begin typing your search above and press return to search.

కారులోనే శృంగారం చేస్తున్న జంట అరెస్ట్

By:  Tupaki Desk   |   2 April 2020 4:04 AM GMT
కారులోనే శృంగారం చేస్తున్న జంట అరెస్ట్
X
యంకామా తురాణం.. నభయం..నలజ్జ అంటారు. అంటే కామంతో కళ్లు మూసుకొని పోయేవారికి ఎక్కడ, ఎప్పుడు ఏం చేయాలన్న సిగ్గు, భయం అన్నది ఉండదని అర్థం. ఇప్పుడు ఈ జంట కూడా అదే పనిచేసింది. ఫుల్లుగా తాగి మద్యం మత్తులోనే శృంగారం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

ఫుల్లుగా తాగారు.. మైమరిచి ఉన్నారు. ఇంకేముందు ఆ జంటకు కన్ను మిన్ను కానరావడం లేదు. పీకలదాకా తాగిన ఓ ఆడ, మగ ప్రేమ జంట న్యూసెన్స్ సృష్టించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కారులో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్నారు.

మధ్యలో టీ, లేదా కాఫీ తాగడానికో పోలీసులు కారు దిగి వెళ్లిపోయారు. ఆ జంట మాత్రమే కారులో ఉంది. దీంతో ఇదే మంచి సమయం అని బట్టలన్నీ విప్పేసి కారులో శృంగారం చేయడం మొదలు పెట్టారు. పోలీసులు పని పూర్తి చేసుకొని వచ్చేసరికి వారిద్దరి జంట నగ్నంగా సెక్స్ చేసుకుంటూ మునిగితేలుతున్నారు. అవాక్కైన పోలీసులు వారిని వారించారు. పోలీస్ కారులో ఇదేం పని అని అడ్డుకోబోయారు. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ జంట పోలీసుల మాట వినలేదు.. దీంతో బలవంతంగా వారిద్దరిని విడదీసి కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ లో చోటుచేసుకుంది.

అనంతరం వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మద్యం సేవించి న్యూసెన్స్ చేయడంతోపాటు పోలీస్ కారులోనే శృంగారానికి పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. జైలుకు పంపారు.