Begin typing your search above and press return to search.

చైనా మాస్క్‌లు, కరోనా టెస్ట్ కిట్స్ నాసిరకం ...పక్కన పడేస్తున్న యూరోపియన్ కంట్రీస్ !

By:  Tupaki Desk   |   31 March 2020 11:10 AM GMT
చైనా మాస్క్‌లు, కరోనా టెస్ట్ కిట్స్ నాసిరకం ...పక్కన పడేస్తున్న యూరోపియన్ కంట్రీస్ !
X
కరోనా వైరస్ ..ప్రపంచం మొత్తం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తరువాత అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ దేశాలకు వైరస్ వ్యాప్తి చెందుతోంది. అయితే , కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా ఇప్పటికే కరోనా పై విజయం సాధించింది. ప్రస్తుతం అక్కడ కరోనా పాజిటివ్ కేసులు అంతగా నమోదు కావడంలేదు. కరోనా పై విజయం సాధించిన చైనా ..కరోనా పై పోరాడుతున్న దేశాలకి తమ వంతు సాయంగా వైద్య పరికరాలు, ఫేస్ మాస్క్‌లు, టెస్ట్ కిట్స్ సరఫరా చేస్తోంది.

అయితే , చైనా పంపిన కరోనా వైరస్ నిర్ధారణ టెస్టు కిట్స్ నాసిరకంగా ఉండటంతో యూరోపియన్ దేశాల్లో చాలామంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సరైన సమయంలో వైరస్ నిర్ధారణ జరగక పోవడంతో వందలాది మంది మృతి చెందారు. చైనా సరఫరా చేసిన నాసికరం టెస్టులు, ఫేస్ మాస్క్ ల నాణత్య లోపం కారణంగానే పరిస్థితి తీవ్రంగా మారిందని యూరోపియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా పంపిన మాస్క్‌ లు, కరోనా టెస్ట్ కిట్స్ వాడకూడదు అని నిర్ణయించుకున్నాయి.

ఈ నిర్ణయాన్ని ముందుగా యూరోపియన్ దేశమైన నెదార్లాండ్ తీసుకుంది. చైనా తయారు చేసిన ఫేస్ మాస్క్ లు, టెస్టు కిట్లను బయట పారేసింది. నాణ్యమైన టెస్టుల్లో విఫలమైన తర్వాత ఆస్పత్రి నుంచి మిలియన్ సగానికి పైగా ఫేస్ మాస్క్ లను రీకాల్ చేస్తోంది. డచ్ ప్రభుత్వం ఇప్పటికే 6లక్షలు FFP2 మాస్క్‌లను ఆస్పత్రుల నుంచి రీకాల్ చేయాలని ప్రకటించింది. ఇది వరకే కొన్ని ఆస్పత్రులు చైనా మాస్క్ లను తిరస్కరించినట్టు డచ్ పబ్లిక్ బ్రాడ్ క్యాస్టర్ NOS నివేదించింది.

ప్రస్తుత అత్యవసర పరిస్థితి లో కొత్త సప్లయర్లతో ఈ సమస్యను అధిగమించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది. బెల్జియంలోని లివెన్ యూనివర్శిటీ ఆస్పత్రి లో కూడా 3వేల వరకు చైనా మాస్క్‌లను తిరస్కరించింది. ఇటలీ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యధిక కరోనా మృతులు నమోదైన దేశంగా స్పెయిన్ 8,000 రాపిడ్ టెస్టింగ్ కిట్స్ విత్ డ్రా చేసుకుంది. మాడ్రిడ్ లోని అధికారులకు ఈ కిట్స్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మరో 50వేల వరకు తిరిగి చైనాకు పంపించారు.