Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: భారత్-చైనా మధ్య యుద్ధ మేఘాలు?

By:  Tupaki Desk   |   27 May 2020 6:15 AM GMT
బ్రేకింగ్: భారత్-చైనా మధ్య యుద్ధ మేఘాలు?
X
భారత్-చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టే కనిపిస్తోంది. కరోనా వైరస్ పుట్టించి ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ చైనా తన దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోవడం లేదు. ఆ అపవాదు మరల్చేందుకు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది.

తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధ సన్నాహాలకు సిద్ధంగా ఉండాలని తమ సైనిక దళాలకు పిలుపునివ్వడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు తమ సైన్యాన్ని కోరారు.

చైనాకు ప్రపంచంలోనే అతి భారీ సైన్యం ఉంది. దాదాపు 20 లక్షల మిలటరీకి హెడ్ అయిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజాగా ఆర్మీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. ఆర్మీ శిక్షణను మరింత పెంచుకోవాలని.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా దేశ సార్వభౌమాధికారాన్ని సెక్యూరిటీని పరిరక్షించుకోవడానికి సమాయత్తం కావాలని జిన్ పింగ్ సూచించారని చైనా వార్త సంస్థలు తెలిపాయి.

అయితే చైనా ఎవరితో యుద్ధం చేయబోతోంది? ఏ దేశంతో ఫైట్ కు యుద్ధ సన్నాహాలు చేయండనేది మాత్రం జిన్ పింగ్ పేర్కొనలేదు..

ప్రస్తుతం భారత్-చైనాలో మధ్య సిక్కిం, లడఖ్ లలో చైనా సైనికులతో భారత సైనికులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా యుద్ధ సన్నాహాలకు రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే భారత్-చైనాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నట్టే తెలుస్తోంది.