Begin typing your search above and press return to search.

కరోనాకు చెక్ పెడుతున్న ప్లాస్మా థెరపీ

By:  Tupaki Desk   |   8 April 2020 5:30 AM GMT
కరోనాకు చెక్ పెడుతున్న ప్లాస్మా థెరపీ
X
అద్భుతం సాధ్యమైంది. దక్షిణ కొరియా వైద్యులు ఇద్దరు వృద్ధులను సరికొత్త చికిత్సతో కరోనా నుంచి బయట పడేసిన వైనం చూశాక ఇప్పుడు కరోనాకు ఈ చికిత్స బెటర్ అని అందరూ అంటున్నారు.

దక్షిణ కొరియాలో ఇద్దరు వృద్ధులు ‘ప్లాస్మా థెరపీ’తో కరోనా వైరస్ నుంచి విముక్తి కావడం విశేషంగా మారింది. కరోనా సోకిన వారికి ప్లాస్మాతో చికిత్స చేయగా.. తీవ్రమైన న్యూమోనియా లక్షణాల నుంచి కూడా వీరు బయటపడడం విశేషంగా మారింది.

ఇప్పుడు సౌత్ కొరియా చేసిన ఈ చికిత్స ప్రపంచానికి ఆశాజనం గా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ‘ప్లాస్మా థెరపీ’ ఆశాజనంగా కనిపిస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రక్తంలో కలిసుండే జిగురులాంటి పారదర్శక పదార్థాన్నే ప్లాస్మా అంటారు. కరోనా వైరస్ సోకి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ తయారవుతాయి. వాటిని ఉపయోగించే తాము చికిత్స చేశామని పరిశోధకులు తెలిపారు. యాంటీ వైరల్ మందులకు స్పందించని ఇద్దరు సీరియస్ గా ఉన్న వృద్ధులకు ప్లాస్మా థెరపీ చికిత్స చేస్తే కోలుకున్నారని వైద్యులు తెలిపారు. 71,67 ఏళ్ల ఇద్దరు వృద్ధులు ప్లాస్మా చికిత్స తో కోలుకోవడంతో ఇది కరోనా పై అద్భుత విజయంగా అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు సౌత్ కొరియా వైద్యులు కరోనాను జయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత అందుబాటులోకి తేనున్నారు.