నేపాల్ లో విజృంభించిన కరోనా వైరస్

Thu May 13 2021 06:00:01 GMT+0530 (IST)

Corona virus outbreak in Nepal

నేపాల్ పై కరోనా వైరస్ పంజా విసిరింది. కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 9483 కేసులు నమోదు కాగా.. 225 మంది రోగులు మరణించారు. నేపాల్ అంతటా సెకండ్ వేవ్ కోవిడ్ వ్యాపించింది.నేపాల్ లో కొద్దిరోజులుగా దాదాపు 8వేల కేసులు నమోదవుతున్నాయి. 30 మిలియన్ల మంది ప్రజలున్న ఆ దేశంలో ఇది అత్యధికం అంటున్నారు. ఖట్మండు సహా దేశంలోని అన్ని ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఆక్సిజన్ మందులు వంటి కొరత తీవ్రంగా ఉంది.నేపాల్ లో ఇప్పటివరకు 4084 మంది రోగులు మరణించారు. కేసుల సంఖ్య 413111కి పెరిగింది. 24 గంటల్లో 5 వేల మందికి పైగా రోగులు కోలుకున్నట్టు పేర్కొంది.

ఇక నేపాల్ లో కొత్త కేసుల్లో ఒక్క ఖట్మాండులోనే అత్యధికంగా 3927 కేసులు ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇక నేపాల్ ను ఆదుకునేందుకు చైనా ముందుకొచ్చింది. 400 ఆక్సిజన్ సిలిండర్లు 160 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు 10వెంటీలేటర్లను అందజేసింది. 20వేల ఆక్సిజన్ సిలిండర్లను పంపుతామని హామీ ఇచ్చింది.