కరోనా టీకా రూ.75.. ఆసక్తికరంగా మారిన కొత్త లెక్క

Thu Apr 22 2021 11:03:42 GMT+0530 (IST)

Corona vaccine is Rs.75

యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా మంత్రాన్ని జపిస్తోంది. మనుషుల ప్రాణాల్ని తీయటమే కాదు.. ఆర్థిక పరిస్థితుల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ఇలాంటి వేళ.. కరోనా తీవ్రతను అడ్డుకునే అవకాశాల కోసం ప్రపంచం తీవ్రంగా గాలిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్.. మందులతో పాటు.. ఇతర అంశాల్ని వెతుకుతున్నారు. ఈ క్రంలో అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా ఒక కొత్త టీకా విధానాన్ని ఆవిష్కరించింది.ఒక్క డోసును కేవలం రూ.75లకే అందుబాటులోకి వచ్చేలా ఉండటం దీని ప్రత్యేకత. దీన్ని డెవలప్ చేసిన విధానం కూడా భిన్నంగా ఉందని చెబుతున్నారు. పోర్కైన్ ఎపిడమిక్ డయేరియా వైరస్ పందుల్లో వస్తుంది. డయేరియా.. తీవ్ర జ్వరం తదితర ఇబ్బందుల్ని కలుగజేసే వైరస్ కూడా కరోనా కుటుంబానికి చెందినదే.

తాజా పరిశోధనల్లో భాగంగా దీని ఆధారంగా టీకాను రూపొందించారు. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్ లకు ఉండే ప్యుజన్ పెప్టైడ్ లను లక్ష్యంగా చేసుకొని పని చేస్తాయి. ఇవి ఇన్ ఫెక్షన్ ను నిలువరించకున్నా.. వైరస్ మీద పోరాడే రోగనిరోధక శక్తిని వేగంగా తయారుచేస్తాయని చెబుతున్నారు. ఈ తరహా టీకా కూడా కరోనా కట్టడికి సాయం చేస్తుందని చెబుతున్నారు.