Begin typing your search above and press return to search.

ఆ దేశంలో చేప‌ల‌కు, పీత‌ల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు!

By:  Tupaki Desk   |   19 Aug 2022 3:30 PM GMT
ఆ దేశంలో చేప‌ల‌కు, పీత‌ల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు!
X
క‌రోనా వైర‌స్ పుట్టినిల్లు చైనాలో ఇటీవ‌ల మ‌ళ్లీ క‌రోనా కేసులు విజృంభించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌ళ్లీ క‌ట్టుదిట్ట‌మైన లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఉధృతంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అయితే మ‌నుషుల‌తోపాటు చేప‌లు, పీత‌ల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. చేప‌లు, పీత‌ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

నవంబర్ 2020లో కోవిడ్-19 ప్రపంచాన్ని స్తంభింపజేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. అయితే వ్యాక్సిన్ల రాక‌తో క‌రోనాకు కాస్త‌ అడ్డుక‌ట్ట ప‌డింది. అయితే.. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.

చైనాలోని జియామెన్‌లో కూడా కేసులు పెరిగాయి. చైనాలో ఐదు మిలియన్ల మందికి పైగా ప్రజలు పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే, పరీక్ష కేవలం మనుషులకే పరిమితం కాదు. అధికారులు సీఫుడ్‌లో కూడా వైరస్‌ను పరీక్షించే పనిలో పడ్డారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ -19 వైరస్ కోసం చేపలు, పీతలు వంటి వాటిని పరీక్షిస్తున్నట్లు ఉంది. ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్‌లను ధరించి చేపలు, పీతల నోటిలో నుంచి స్వాబ్‌ను సేక‌రించారు. దీంతో ఈ వీడియో చైనా మీడియా అంతటా వైరల్‌గా మార‌డంతో పాటు చ‌ర్చ‌కు దారి తీసింది.

ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత వీడియోను దాదాపు 2 లక్షల మంది చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.చేప‌లు, పీత‌ల‌కు కూడా కరోనా ప‌రీక్ష‌లంటే విచిత్రంగా అనిపిస్తోంది, అయితే, పరీక్షించకుండా తెలుసుకోవటానికి వేరే మార్గం లేదు. క‌రోనా వైర‌స్... జంతువు/మానవ, మానవ/మానవ ప్రసారం గురించి అందరికీ ఇప్పటికే తెలుసు. కాబ‌ట్టి పరీక్షించండి అని నెటిజ‌న్ కామెంటులో రాశారు.

మరొక నెటిజ‌న్ ఇలా వ్యాఖ్యానించారు.. "ఇది ఒక జోక్ అని అనుకున్నాను.. కానీ వాస్తవం చాలా భ‌యాన‌కంగా ఉంది" అని కామెంట్ చేశారు.కాగా నౌక‌ల్లో ప‌నిచేసేవారంతా ప్రయాణించే ముందు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాల‌ని చైనా ప్ర‌భుత్వం ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు రోజుకు ఒకసారి క‌రోనా పరీక్షలు చేయించుకోవాల‌ని సూచించింది. అలాగే సముద్రం నుండి తిరిగి వచ్చినప్పుడు.. మత్స్యకారులు, సముద్రపు ఆహారం రెండింటిని తప్పనిసరిగా పరీక్షించాల‌ని అని సూచించింది.