Begin typing your search above and press return to search.

అమెరికా మహిళలపై కరోనా పగ..ఏం చేసిందంటే!

By:  Tupaki Desk   |   13 Jan 2021 12:30 PM GMT
అమెరికా మహిళలపై కరోనా పగ..ఏం చేసిందంటే!
X
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. కరోనా విజృంభణతో ప్రజలు భయకంపితులవుతున్నారు. అక్కడ నిముషానికి ఒకరిని కరోనా వైరస్‌ బలితీసుకుంటున్నది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్‌ అన్ని కరోనా పేషంట్లతో నిండిపోయాయి. కరోనా కి తోడు , స్ట్రెయిన్ వైరస్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ ఒక్క నెల లోనే అమెరికా మొత్తం మీద 1,40,000 వేలమంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాలో కరోనా వైరస్ మొదలైన దగ్గర నుండి అంటే ఫిబ్రవరి నుండి జనవరి వరకు ఎంతమంది మహిళలు తమ ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారనే విషయమై నేషనల్ విమెన్ లా సెంటర్ ఓ సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించింది.

అందులోని వివరాలు చూసిన తర్వాత కరోనా వైరస్ ఏమైనా అమెరికాలోని మహిళలపై ప్రత్యేకంగా పగపట్టిందా అనే అనుమానం రాకమానదు. గడచిన తొమ్మిది మాసాల్లో అమెరికాలో 21 లక్షల మంది మహిళలు ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారని సర్వేలో బయటపడింది. కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఆర్ధిక వ్యవస్ధ కుదేలైందన్నది నిజం. దీనివల్ల పురుషులు, స్త్రీలన్న తేడాలేకుండా కొన్ని కోట్లమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా నుండి కొన్ని దేశాలు కోలుకుంటున్నట్లే అమెరికా కూడా కుదుటపడుతోంది. వైరస్ దెబ్బకు మూతపడిన అనేకరంగాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయి.

అయితే తెరుచుకుంటున్న టూరిజం, సర్వీసెస్, ఐటి, హోటల్ మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో పురుషులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారట. ఇపుడు మగవాళ్ళను తీసుకుంటున్న ఉద్యోగాలను గతంలో ఆడవాళ్ళు చేసినా సరే తాజాగా స్త్రీలను మళ్ళీ ఆ స్ధానాల్లో తీసుకోవటానికి మాత్రం కంపెనీలు ఇష్టపడటం లేదట. పై రంగాలతో పాటు మహిళలు ఎక్కువగా విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా పనిచేస్తుంటారు. 1975 తర్వాత మహిళలు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కోల్పోవటం ఇదే మొదటిసారని సర్వే స్పష్టం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ముందు నుండి తీసుకుంటే ఇప్పటివరకు మగవాళ్ళు కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి 4.4 మిలియన్లయితే ఆడవాళ్ళు కోల్పోయిన ఉపాధి, ఉద్యోగాల సంఖ్య 5.4 మిలియన్లట. జెండర్ సమానత్వం కోసం జరిగే పోరాటాల్లో అమెరికా ఎప్పుడూ ముందుంటుంది.