Begin typing your search above and press return to search.

మరికాసేపట్లో పెళ్లి .. వధువుకి కరోనా పాజిటివ్ , అసలు ట్విస్ట్ అదుర్స్ !

By:  Tupaki Desk   |   7 May 2021 9:30 AM GMT
మరికాసేపట్లో పెళ్లి .. వధువుకి కరోనా పాజిటివ్ , అసలు ట్విస్ట్ అదుర్స్ !
X
పెళ్లికొడుకు , పెళ్లి కూతురు , ఇరువైపుల బంధువులు , పెళ్లి మండపం అన్ని సిద్ధం మరికొద్ది నిముషాల్లోనే ఆ ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అనుకుంటూ ఇరు కుటుంబ సభ్యులు ఆనందపడుతున్న సమయంలో సడన్ గా ఆ పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం స్వయానా పెళ్లి కూతురే. పెళ్లి ఇష్టం లేదని తనకి కరోనా సోకింది అంటూ ఓ హైడ్రామా కి తెరతీసింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో అక్కడ ఆ వధువు తన మనసులో మాట చెప్పింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించారు.

వివరాల్లోకి వెళ్తే .. ధర్మవరంకు చెందిన ఓ యువకుడికి ముదిగుబ్బకు చెందిన ఓ యువతితో పెళ్లి గురువారం తెల్లవారుజామున నిశ్చయమైంది. కదిరిలో నృసింహుని ఆలయంలో జరగాల్సి ఉంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయానికి వచ్చారు. ఈ లోగా పెళ్లి కుమార్తె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అయినా కూడా ఆమె మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. పెళ్లి ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా పెళ్లి కూతురును మండపంలోనికి తీసుకొచ్చారు. ఇంతలోనే ఆమె బాంబు పేల్చింది. కరోనా ఉందని అక్కడున్నవారికి చెప్పింది. అంతే అక్కడున్న వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. పెళ్లి కూతురు కరోనా వార్తతో కంగారు పడ్డ పెళ్లి కొడుకు వారికి అసలు విషయం తర్వాత తెలిసింది. వివాహం ఇష్టం లేకనే ఆమె కరోనా ఉందంటూ కొత్త డ్రామాకి తెరతీసింది అని అర్ధమైంది.

దీనితో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరింది. తనకు పెళ్లి ఇష్టం లేదని, అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్‌ అని అబద్ధం చెప్పాడంది. తాను బీటెక్‌ చదివానని తన మనసులో మాట చెప్పింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, పెళ్లి వాయిదా వేసుకుందామని చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని ఆమె కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని, తమకు అవమానంగా ఉందని పెళ్లి కుమారుడితోపాటు అతని తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం ముందుగానే రూ.1.50 లక్షలు పెళ్లి కుమార్తె బ్యాంకు అకౌంట్‌ కు జమ చేశామన్నారు. ఆ డబ్బు ఇస్తే తన దారిన తాను వెళ్లిపోతానని ఆ యువకుడు తేల్చిచెప్పాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌ కాదని, పెళ్లి కోసం ఇచ్చిన డబ్బుల విషయంలో పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏదేమైనా పెళ్లి పీటల మీదకి వచ్చిన పెళ్లి సడన్ గా ఆగిపోయింది.