Begin typing your search above and press return to search.

వైజాగ్‌ లో 60 రోజుల తర్వాత కోలుకున్న కరోనా పేషేంట్ !

By:  Tupaki Desk   |   30 July 2021 7:19 AM GMT
వైజాగ్‌ లో 60 రోజుల తర్వాత కోలుకున్న కరోనా పేషేంట్ !
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశంలో తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా తగ్గలేదు అనే విషయాన్ని అందరూ గుర్తించి నడుచుకోవాలి. ఇక దేశంలో కరోనా కేసులు తగ్గిపోవడం తో దాదాపుగా పరిస్థితిలు అన్ని కూడా యధాస్థానాన్ని వచ్చాయి. అందరూ కూడా తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే..ఏపీలో ఓ వ్యక్తి కరోనా మహమ్మారి బారిన పడి 60 రోజుల పాటు హాస్పిటల్ లో కరోనా వైరస్ తో పోరాడి, కరోనా నుండి కోలుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం లో చోటు చేసుకుంది. 60 రోజుల పాటు కరోనా మహమ్మారి తో పోరాడి , కోలుకోవడం విశేషం.

నరేశ్ అనే రోగి కూడా ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ద్వారా కాపాడబడ్డారని కిమ్స్ ఆసుపత్రిలోని పల్మోనాలజిస్ట్ ఫణీంద్ర గురువారం వెల్లడించారు. మొదట చికిత్స కోసం మరొక ఆసుపత్రిలో చేరిన నరేష్ అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మే నెల లో ఇక్కడకు వచ్చాడని , మొదట్లో అతనికి చాలా ఆక్సిజన్ అవసరం వచ్చేదని డాక్టర్ ఫణీంద్ర చెప్పారు. తరువాత, నరేశ్‌ కు పల్మనరీ థ్రోంబోఎంబోలిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని రవాణా చేసే రక్త కేశనాళికల నిరోధానికి దారితీస్తుందని డాక్టర్ చెప్పారు.

దీనితో ఆపరేషన్ చేసి , 25 రోజుల పాటు ఐసీయూ లో పెట్టిన తర్వాత , నరేష్‌ ను సాధారణ వార్డుకు తరలించినట్టు తెలిపారు. ఆ సాధారణ వార్డులో అతను మరో 40 రోజులు గడిపి కరోనా మహమ్మారి నుండి పూర్తిగా కోలుకున్నట్టు తెలిపాడు. దీని తరువాత, వైద్యులు అతని ఊపిరితిత్తులలో ద్వితీయ సంక్రమణ కోసం బ్రోంకోస్కోపీని పరీక్షించారు, ఊపిరితిత్తులలోని కావిటీస్ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లను వచ్చినట్టు వెల్లడించారు. ఈ తరహా వైద్య విధానాలను పూర్తి చేసిన తరువాత, వైద్యులు చివరకు నరేష్ నయమయ్యారని మరియు ఇప్పుడు రోజువారీ కార్యకలాపాలను చేయగలరని వెల్లడించారు.

నరేష్ అన్ని రోజుల పాటు కరోనాతో పోరాడి, కోలుకోవడంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎంతో మంది ఉంది. డాక్టర్లు ఎంత హెచ్చరికలు జారి చేసినా కూడా, నరేష్ భార్య శరణ్య పిపిఈకిట్ ధరించి భర్త తో పాటుగా ఐసీయూ లోనే అతడికి తోడుగా ఉన్నది. తన భర్త లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చివరికి భర్త ను ఆరోగ్యంగా తిరిగి మాములు మనిషిగా చేసుకుంది.