నారా లోకేష్ కు కరోనా!

Mon Jan 17 2022 15:18:16 GMT+0530 (IST)

Corona infected Nara Lokesh

టీడీపీ నేత నారా లోకేష్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టాడు. తనకు లక్షణాలేవీ లేవని.. ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపాడు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు లోకేష్ ప్రకటించాడు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు.గత వారం రోజులుగా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. ఒకటి రెండు ట్వీట్లు మాత్రమే చేశారు. ఈ ఉదయం స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ ట్వీట్ చేశాడు.

కాసేపటికే తనకు కరోనా సోకిందని షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.  తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు ఇతర చోట్ల కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తుంటారు. తొలి రెండు వేవ్ లలో అందుకే టీడీపీ ఆఫీసు సిబ్బంది కూడా పెద్దగా కరోనా బారినపడలేదు.

కానీ థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్ కు కూడా సోకింది. ప్రస్తుతం ఈ వేవ్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. అయితే ఎక్కువ మందికి అతి స్వల్ప లక్షణాలు.. లేదా లక్షణాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య మొదటి రెండో వేవ్ తో పోలిస్తే తక్కువే. అయినప్పటికీ ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా అన్నిరకాల ఏర్పాట్లు చేసుకున్నాయి.