Begin typing your search above and press return to search.

సింహాలకు వచ్చిన వైరస్ అదేనట!

By:  Tupaki Desk   |   7 May 2021 6:30 AM GMT
సింహాలకు వచ్చిన వైరస్ అదేనట!
X
హైద‌రాబాద్ లోని నెహ్రూ జూపార్కులో మొత్తం 8 సింహాల‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా సింహాలు అనారోగ్యంగా క‌నిపించ‌డంతో.. వాటి శాంపిళ్లు సేక‌రించిన అధికారులు సీసీఎంబీకి పంపించారు. నిపుణులు ప‌రీక్షించార‌ని, వాటికి కొవిడ్‌-19 నిర్ధార‌ణ జ‌రిగింద‌ని ప్ర‌చారం సాగింది.

అయితే.. ఈ ప‌రీక్ష‌ల రిపోర్టు ప్ర‌కారం.. సింహాల‌కు సోకింది కొవిడ్ వైర‌స్ కాద‌ని వైద్యులు ధృవీక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ వైద్యాధికారి డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌క‌టించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అది క‌రోనా కాద‌ని, ‘సార్స్-2 వైరసుల్లో కొవిడ్-19 ఒక‌టి. ఇది మ‌నుషుల‌ను ఇబ్బంది పెడుతుంది. సింహాల‌కు వ‌చ్చింది ఇది కాదు’ అని నిర్ధారణ జరిగిందని ప్రవీణ్ చెప్పినట్టు సమాచారం.

ఇక కుక్క‌ల‌కు క‌రోనా వైర‌స్ 20 ఏళ్ల నుంచీ ఉంద‌ని కూడా ఆయ‌న తెలిపిన‌ట్టు స‌మాచారం. ఇలాంటి వాటిల్లో ఓ వైర‌స్ వ‌చ్చింద‌ని, వాటికి టీకాలు కూడా వేస్తున్నామ‌ని చెప్పార‌ట‌. అదేవిధంగా.. జంతువుల‌కు సోకిన వైర‌స్ మ‌నుషుల‌కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది.