షాకింగ్ న్యూస్ : జూ పార్క్‌లో 8 సింహాలకు సోకిన కరోనా !

Tue May 04 2021 15:00:01 GMT+0530 (IST)

Corona infected 8 lions in zoo park

కరోనా కేవలం మనుషులపై మాత్రమే కాదు జంతువులపై కూడా పంజా విసురుతోంది. జంతువులకి కరోనా అంటే చాలామంది షాక్ అయ్యారు. కానీదేశంలోనే మొదటిసారిగా ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్  లోని ఆసియా సింహాలకి  కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ ఈ విషయాన్ని ఏప్రిల్ 29న ఎన్ జెడ్‌పి అధికారులకు మౌఖికంగా తెలిపింది. సింహాలకు జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిపారు.ఈ విషయాన్ని జూ అధికారులు వెల్లడించారు. ఇవాళ వాటి రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానం అందుకే 8 సింహాలకు కరోనా  టెస్ట్ చేయ డం జరిగిందని అధికారులు తెలిపారు.ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులు మూసి వేశారు.  దీనితోనే  ఇప్పుడు జూ పార్క్ అధికారులు ఆదివారం నుండి జూ పార్క్ లో సందర్శ కులకు అనుమతి నిరాకరించారు. కరోనా విస్తరణ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూ పార్క్‌లు పులుల అభయారణ్యాలు జాతీయ ఉద్యాన వనాలను మూసివేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 24 న జూ పార్క్ లో పనిచేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం ముక్కునుంచి రసి కారడం అలాగే దగ్గు వంటి కోవిడ్ లక్షణాలను గమనించారు. ఇది 40 ఎకరాల సఫారీ ప్రాంతం. ఇక్కడ 10 సంవత్సరాల వయస్సు గల 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు నాలుగు మగ సింహాలు పాజిటివ్ గా తేలిందని తెలుస్తోంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ రెండు రోజుల క్రితం మూసివేశారు. ఇది జనసాంద్రత ఉన్న ప్రాంతంలో ఉన్నందున ఇప్పుడు గాలిలో కూడా ఉన్న వైరస్ జూ పరిసరాల్లో నివసించే ప్రజల నుండి సింహాలకు సోకి ఉండవచ్చు. లేదా ఇది జూ-కీపర్లు లేదా సంరక్షకుల నుండి వచ్చిన అవకాశం కూడా ఉంది అని జూ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రిపోర్ట్స్ కోసం జూ అధికారులు ఎదురుచూస్తున్నారు. రిపోర్ట్స్ ను బట్టి ట్రీట్మెంట్ కి ఏర్పాట్లు చేయనున్నారు.