విచిత్రం: పరీక్ష చేయించుకోని మహిళకు కరోనా

Sat Aug 01 2020 21:50:13 GMT+0530 (IST)

Corona for a woman who has not undergone a test

అమె పరీక్షనే చేయించుకోలేదు. కానీ అధికారులు మాత్రం ఫలానా మహిళకు కరోనా వచ్చిందని సమాచారం ఇచ్చారు. దీంతో వలంటీర్ ఆ మహిళకు సమాచారం ఇవ్వగా విషయం బయటపడింది. తాను పరీక్ష చేయించుకోకుండానే కరోనా ఎలా వచ్చిందని మహిళ నిలదీయడంతో తప్పు జరిగిందని తెలుసొచ్చింది.ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని జంపాలవారిపాలెంలో ఇటీవల కరోనా నిర్ధారణ శిబిరం నిర్వహించారు. అయితే చాలా మంది మహిళలకు టెస్టులు చేశారు.

ఆ రిపోర్టుల్లో తాజాగా ఒక మహిళకు కరోనా వచ్చినట్లు అధికారులు సమాచారం పంపారు. గ్రామ వలంటీర్ ఆ మహిళకు తెలియజేయగా.. తాను అసలు కరోనా టెస్ట్ చేయించుకోలేదని.. తనకు ఎలా కరోనా వచ్చిందని ప్రశ్నించింది. దీంతో ఖంగుతిన్న అధికారులు అసలు కరోనా వచ్చిన మహిళ ఎవరు అని ఆరాతీసే పనిలో పడ్డారు.