Begin typing your search above and press return to search.

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   15 Jun 2021 8:30 AM GMT
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే ?
X
మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో కొంచెం ఊరట కలిగించే అంశం. గతంలో లక్షల్లో నమోదైన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు, ఆ తర్వాత విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 76 రోజుల్లో అత్యంత తక్కువ రోజువారీ పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజాగా కరోనాతో 2,726 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 2,95,70,881 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3,77,031 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,82,80,472 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక 9,13,378 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే జరుగుతోంది. నిన్న 39,27,154 మందికి వ్యాక్సిన్‌ అందజేయగా, ఇప్పటి వరకు 25,90,44,072 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. కాగా, కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో లాక్‌ డౌన్‌ ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలని తొలగిస్తూ వస్తున్నాయి. దేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచదేశాల్లో ఇది 2.16 శాతంగా ఉంది. రికవరీ రేటు కొద్దిగా పెరిగి 95.6కి చేరింది.