శృంగార సామర్థ్యంపై కరోనా దెబ్బ.. ఆ ఆసక్తి తగ్గిందట..

Sat Jan 15 2022 20:19:00 GMT+0530 (IST)

Corona blow on sexual ability

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను మరోసారి అల్లకల్లోలానికి గురిచేస్తోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కరోనా వ్యాప్తి  చెందడాన్ని నివారించడానికి లాక్ డౌన్ తరహా పరిస్థితులను విధించాల్సి రావడంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయనుకునే దశలో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది.  కరోనా కేసులు భారీగా పెరగడానికి ఇదీ ఓ కారణమైంది.

-కండోమ్ కంపెనీలకు కష్టాలు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్థికరంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

కార్పొరేట్ సెగ్మెంట్ లో ఎవర్ గ్రీన్ గా చెప్పుకొనే కంపెనీలుసైతం నష్టాల బారిన పడడం దీనికి కారణంగా చెప్పొచ్చు. కండోమ్ తయారీ కంపెనీలుసైతం నష్టాల బాట పట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లాక్ డౌన్ ను విధించిన సమయంలో ఒక్కసారిగా పెరిగిన వాటి అమ్మకాలు.. ఇప్పుడు ఢామ్మంటూ పడిపోయాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ కంపెనీ కారెక్స్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. తమ కండోమ్ అమ్మకాలు 40శాతం వరకూ పడిపోయాయని ప్రకటించింది. మలేషియాకు చెందిన కండోమ్ తయారీ కంపెనీ కారెక్స్.. ‘డ్యూరెక్స్’ బ్రాండ్ తో ప్రపంచవ్యాప్తంగా కండోమ్స్ ఎగుమతి చేస్తోంది.  కండోమ్స్ మార్కెట్ పై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. శృంగారం చేసే సమయంలో వినియోగించే ప్రతి కండోమ్ లో ఒకటి డ్యూరెక్స్ దే..