Begin typing your search above and press return to search.

మాజీ సీఎంకు మహమ్మారి పాజిటివ్ ..!

By:  Tupaki Desk   |   25 May 2020 7:00 AM GMT
మాజీ సీఎంకు మహమ్మారి పాజిటివ్ ..!
X
దేశంలో మహమ్మారి విలయం ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తోంది. ఎవరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి అశోక్‌ చవాన్‌ కూడా కరోనా సోకింది. ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ..పాజిటివ్ అని తేలింది. దీనితో ప్రస్తుతం తన స్వస్థలం నాందేడ్ ‌లో చవాన్‌ చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. ప్రస్తుతం సీఎం ఉద్దవ్ థాక్రే కేబినెట్‌లో అశోక్ చవాన్ మంత్రిగా పని చేస్తున్నారు.కొన్ని రోజులుగా తరుచూ అనారోగ్యానికి గురికావడంతో అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. అందులో అతనిని వైరస్ సోకినట్టు తేలింది. అధికారిక పనుల నిమిత్తం తరుచూ ఆయన స్వగ్రామం నుంచి ముంబై ప్రయాణిస్తూ ఉంటారు. మధ్యలో చాలా మందిని కలుస్తూ ఉండటంతో వ్యాధి సోకినట్టుగా అనుమానిస్తున్నారు.

దీనితో మంత్రికి సన్నిహితంగా ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్‌ కు వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ ఆస్పత్రిలో రెండు వారాలకు పైగా చికిత్స అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.