ఢిల్లీలో డాక్టర్ కి కరోనా ... హాస్పిటల్ మూసివేత !

Wed Apr 01 2020 19:30:28 GMT+0530 (IST)

Corona Positive For Doctor In Delhi

భారత్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని అనుకుంటున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1637కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 45 కి చేరింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన వైద్యులు కూడా పడుతున్నారు.తాజాగా.. ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్ అని రావడంతో ఆ ఆస్పత్రినే మూసివేశారు. కరోనా సోకిన డాక్టర్ ను కలిసినవారు కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈయనకి కరోనా పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తే రాలేదు. బ్రిటన్ నుంచి వచ్చిన బంధువుల నుంచే డాక్టర్ కు కరోనా సోకిఉండవచ్చు అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇటీవల బ్రిటన్ నుంచి డాక్టర్ తమ్ముడు మరదలు ఢిల్లీకి తిరిగివచ్చారనివారి నుంచే డాక్టర్ కు వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. లండన్ నుంచి తిరొచ్చిన డాక్టర్ మరదలు ఇటీవల డాక్టర్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసినట్లు తెలిసిందని సత్యేంద్రజైన్ తెలిపారు.

ఢిల్లీలో ఇప్పటివరకు 121కరోనా కేసులురెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 24 పాజిటివ్ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ఈ 24మంది ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారే. దేశవ్యాప్తంగా అనేకరాష్ట్రాలకు చెందినవారు కూడా నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికోసం ఆయా రాష్ట్రాల 36గంటల నుంచి వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించగామరికొంతమందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరిగాయి.