Begin typing your search above and press return to search.

సచివాలయ ఉద్యోగికి కరోనా నెగిటివ్..ఊపిరి పీల్చుకున్న సిబ్బంది!

By:  Tupaki Desk   |   1 April 2020 12:10 PM GMT
సచివాలయ ఉద్యోగికి కరోనా నెగిటివ్..ఊపిరి పీల్చుకున్న సిబ్బంది!
X
క‌రోనా వైర‌స్ అల‌జ‌డి తెలంగాణ స‌చివాల‌యానికి కూడా చేరింది. ఇటీవ‌ల ఢిల్లీలోని నిజాముద్దిన్‌ లో జ‌రిగిన ముస్లిం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో తెలంగాణ స‌చివాల‌యంలో ప‌ని చేసే ఓ ఉద్యోగి పాల్గొని వ‌చ్చారు. ఈ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వారిలో చాలా మంది క‌రోనా వైర‌స్ సోక‌డంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా ఈ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ఆరుగురు తెలంగాణ వాసులు క‌రోనాతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

అయితే, స‌చివాల‌యంలో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌ గా ప‌ని చేసే ఉద్యోగి ఈ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన విష‌యాన్ని దాచిపెట్టి, బీఆర్కే భ‌వ‌న్‌ లోని తాత్కాలిక స‌చివాల‌యంలో ప్ర‌తి రోజు విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. తాజాగా ఢిల్లీ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండటం తో..ప్రభుత్వం ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి జాభితాను బ‌య‌ట‌కు తేవ‌డంతో స‌ద‌రు ఉద్యోగి కూడా ఢిల్లీ వెళ్లిన‌ట్లు తెలింది. ఆయ‌న స‌చివాల‌యంలో ప‌లువురు ఐఏఎస్ అధికారుల‌ను, ఉద్యోగుల‌ను కూడా క‌లిశారు.

దీనితో మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వం ఖాళీ చేయించింది. అనంతరం సచివాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు. ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన ఉద్యోగిని వైద్యులు ప‌రీక్షించారు. ఆ పరీక్షల్లో అతనికి కరోనా నెగటివ్ అని వచ్చింది. దీనితో సచ్చివాలయ సిబ్బంది మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ,తెలంగాణ రాష్ట్రం నుంచి 1030-2000 పైచిలుకు మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వీరందరినీ స్వచ్చందంగా రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో కొందరు స్వచ్చందంగా ముందుకు రాగా.. ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉంది.